2026 ఆంగ్ల సంవత్సరము, అలాగే పరాభవ నామ సంవత్సరానికి సంబంధించి మకర రాశి అంటే క్యాప్రికార్న్. సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతా ఉన్నాయో చూద్దాము.

2026 ఆంగ్ల సంవత్సరము, అలాగే పరాభవ నామ సంవత్సరానికి సంబంధించి మకర రాశి అంటే క్యాప్రికార్న్. సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతా ఉన్నాయో చూద్దాము. ఉత్తరాషాడ రెండు, మూడు, నాలుగు, శ్రవణం ఒకటి, రెండు, మూడు, నాలుగు, ధనిష్ట ఒకటి, రెండు, పాదములు ఆదాయం-2 వ్యయం-8. రాజపూజ్యం-1, అవమానం-6. ఈ సంవత్సరము ఏ పని చేసినా బ్యాలెన్స్డ్ గా చేయడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. శుభాశుభ ఫలితాలు ఉంటాయి. 50% మంచి, 50% చెడు ఉంటుంది. ఒక నెల మంచిగా ఉంటే, ఒక నెల చెడుగా ఉంటుంది. ఒక నెల డబ్బులు ఉంటే ఒక నెల డబ్బులు ఉండవు, ఒక నెల సమాజంలో మంచి పేరు వస్తే, ఇంకొక నెల చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం గనుక తీసుకుంటే మకర రాశికి మిమ్మల్ని నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశం కనిపిస్తా ఉంది. దేవుడు అని చెప్పి నెత్తిలో పెట్టుకున్న వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది, కాబట్టి వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండండి. భార్యా భర్తల మధ్యన ఈ సంవత్సరం గొడవలు వచ్చే అవకాశం ఉంది. ప్రేమికులైతే విడిపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కాంప్రమైజ్ అవ్వండి, కోపాన్ని తగ్గించుకోండి. మరీ ముఖ్యంగా తీసుకుంటే ఈ సంవత్సరం గనుక తీసుకుంటే, అవమానం అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తుంది, కాబట్టి నమ్మిన వారి వల్ల మోసపోయే అవకాశం ఉంది కాబట్టి, జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు సంబంధించి ఉత్తీర్ణత శాతం బాగుంటుంది కానీ, చెడు స్నేహాల వల్ల ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థులకు అలాగే ఉద్యోగస్తులకు, ప్రభుత్వ ప్రైవేటు రంగ ఉద్యోగస్తులకు అనుకూలమైన ఫలితాలు ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి పొజిషన్ మారేటువంటి అవకాశం ఉంది, అంటే ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. బదిలీలు ఉంటాయి. పై అధికారుల మన్ననలను పొందుతారు, రైతులకు మొదటి పంట కంటే రెండవ పంట దిగుబడి రాబడి పెరుగుతుంది. కానీ మొదటి పంటలో వచ్చిన నష్టాన్ని, రెండో పంటతో కవర్ చేయగలుగుతారు.

చేపలు, రొయ్యలకు, రొయ్యల వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. రొయ్యల రైతులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే పౌల్టీ రంగంలో విశేషించి అనుకూలంగా ఉండబోతా ఉంది. రాజకీయ రంగంలో ఉండే వారికి మాత్రం మీరు నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తా ఉంది. స్త్రీలకు ఈ సంవత్సరం భార్యా భర్తల మధ్యన గొడవలు వచ్చే అవకాశం ఉంది. అది మీనహా స్త్రీలకు చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. మకర రాశి కళాకారులకు, క్రీడాకారులకు అనుకూలంగా ఉండబోతా ఉంది. ఆల్మోస్ట్ ఆల్ 90% అనుకూలంగా ఉన్నప్పటికీ ఓన్లీ మీకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏమిటంటే రాహు కేతువుల సమస్యల వల్ల చిన్న చిన్న సమస్యలు అంటే ముఖ్యంగా పార్ట్నర్షిప్ మధ్య, భాగస్వామ్య వ్యాపారుల మధ్యన గొడవలు, భార్యా భర్తల మధ్యన గొడవలు, ప్రేమికుల మధ్యన గొడవలు, ఇలాంటి సమస్యలు గోచరిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి మీరు ఈ సంవత్సరం చేసుకోవాల్సిన రెమిడీ ఏమిటి అంటే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద మీరు గురువుకు సంబంధించి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం అంటే, అష్టోత్తరం అనేటువంటిది ఉంటుంది. ఎల్లో రంగు పూలతోటి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అది చేయించండి, లేదా శివాలయంలో సోమవారం నాడో రుద్రాభిషేకాన్ని జరిపించుకోండి. వీలుంటే నెలకు ఒక్కసారో, రెండు నెలకు ఒక్కసారో, ఆరు నెలలకు ఒక్కసారో ఇది చేయించుకోండి. కచ్చితంగా సమస్యల నుండి మకర రాశి వారు బయటపడి సత్ఫలితాలను పొందుతారు. ఓం నమో వెంకటేశాయ


Updated On 9 Dec 2025 12:30 PM GMT
ehatv

ehatv

Next Story