2026వ ఆంగ్లనామ సంవత్సరము, అలాగే శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించి మీనరాశి, ఇంగ్లీష్‌లో పీసెస్.

2026వ ఆంగ్లనామ సంవత్సరము, అలాగే శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించి మీనరాశి, ఇంగ్లీష్‌లో పీసెస్. పూర్వభాద్ర నాలుగు, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 రేవతి 1, 2, 3, 4. ఆదాయం -14 వ్యయం-11, రాజపూజ్యం-7, అవమానం-2. ఈ సంవత్సరము ఏలినాటి శని జన్మశనిలో ఉన్నది గుర్తుంచుకోండి చాలా చాలా చాలా సమస్యలు ఉంటాయి. జన్మశని అంటే కరెక్ట్‌గా శని కడుపులో ఉన్నట్టు. ఏలినాటి శని తల నుండి ప్రారంభమై కాళ్ళ వరకు ఉంటుంది. ఎప్పుడైతే పొట్టలోకి వస్తుందో దాన్ని జన్మశని అంటాము, ఒకవైపు గురువు నాలుగు, ఐదు, ఆరు అతిచారము శని జన్మము రాహు వ్యయము, ఏ రకంగా తీసుకున్నా చాలా చాలా చాలా సమస్యలు ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి. విపరీతమైన ధన నష్టము, ఆరోగ్య భంగము, సామాజికంగా గౌరవం దెబ్బతినడము, పని లేకపోవడము, భార్య సంపాదన మీద బ్రతకడము, ఇంట్లో భార్య మాత్రమే సంపాదించే అవకాశము, స్త్రీలు మాత్రమే సంపాదించే అవకాశ, భర్తకు పని లేకపోవడము, విద్యార్థులకు విపరీతమైనటువంటి సమస్యలు, న్యాయపరమైన ఇబ్బందులు, పోలీస్ కేసులు, ప్రేమ వ్యవహారంలో చిక్కులు, ఫెయిల్ అవ్వడము, మార్కులు తక్కువగా రావడము, కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అవ్వడము, వీసాలు రిజెక్ట్ అవ్వడము, ఉద్యోగస్తులకు చాలా సమస్యలు, కేసులు సిబిఐ, ఏసీబీ, సీఐడీ కేసులు, పై అధికారుల వల్ల సమస్యలు అలాగే రాజకీయ నాయకులకు ఫెయిల్యూర్స్ అంటే, ఎన్నికలలో ఓటమి, ధనష్టము, ప్రజల్లో చెడ్డ పేరు, అలాగే ప్రభుత్వంలో చెడ్డ పేరు, పార్టీలో చెడ్డ పేరు, ఉన్న పదవులు కోల్పోవడము, రైతులకు మొదటి పంట అనుకూలంగాను, రెండవ పంట నష్టంగాను ఉండడము, రుణాలు చేయాల్సి రావడము,కౌలుదారులకు విపరీతమైన సమస్యలు, ఆల్మోస్ట్ ఆల్ మీకు ఏ రైతులకు తీసుకున్న ఉదాహరణ చేపల చెరువులు రొయ్యల చెరువుల వారికి ఇబ్బందులు పంట సరిగ్గా చేతికి అందకపోవడము, పౌల్ట్రీ రంగంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి ఉండకపోవడము. కళాకారులు, క్రీడాకారులకు వ్యతిరేకమైన ఫలితాలు, మీకు రావలసినటువంటి అవకాశాలను వేరేవారు తీసుకొని పోవడము, చెడ్డ పేరు చాలా సమస్యలు కాంట్రాక్టర్లకు, బకాయిలు రాకపోవడము, కొత్త కాంట్రాక్ట్ రాకపోవడము, ఏ రంగం వారు క్రీడాకారులు, కళాకారులకు వ్యతిరేకమైన ఫలితాలు, ఆ స్త్రీలకు మరీ ముఖ్యంగా భర్తకు పని లేకపోవడము, భర్త ఉద్యోగంలో గ్యాప్ పురావడము, సాఫ్ట్వేర్ రంగంలో ఉండే ఉద్యోగస్తులకు సమస్యలు, అలాగే అమెరికాలో ఉండేటువంటి భార్యా భర్తలకు మగ సంతానం కలిగితే, ఆటిజంతో పుట్టేటువంటి అవకాశాలు, లేదా న్యూరో ప్రాబ్లం తో పుట్టేటువంటి అవకాశాలు, ఇవన్నీ కూడా చాలా వరకు ఎలినాటి శని 100కు 98% చెడు ఫలితాలను ఇవ్వబోతా ఉంది. జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదాలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, అగ్ని ప్రమాదాలు, ముఖ్యంగా విపరీతమైన ధన నష్టము, మీరు ఎవరికైనా అప్పు ఇస్తే తిరిగి రాకుండా ఉండడము, శత్రుత్వం ఏర్పడడం అనేటువంటివి కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. సాధ్యమైనంతవరకు రాత్రిపూట ప్రయాణాలను వాయిదా వేసుకోండి, అలాగే అనవసరమైన ఖర్చులు చేయకండి. జాగ్రత్తగా ఉన్న డబ్బులను దాచుకోండి. ముందు ముందు మీకు డబ్బు అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఏలినాటి శని ఎఫెక్ట్, గురువు ఎఫెక్ట్ చాలా సమస్యలకు దారితీసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తీరునల్లార్ శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోండి, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ సందర్శనం వల్ల చాలా వరకు సమస్యల నుండి బయట పడతారు. ఓం నమో వెంకటేశాయ


Updated On 9 Dec 2025 1:00 PM GMT
ehatv

ehatv

Next Story