2026 ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి అలాగే శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించి సింహరాశి ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

2026 ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి అలాగే శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించి సింహరాశి ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి అంటే ఆంగ్లములో లియో అని అర్థం. మఖ ఒకటి, రెండు మూడు, నాలుగు, పాదములు.. అలాగే పుబ్బ ఒకటి, రెండు, మూడు నాలుగు పాదములు, అలాగే ఉత్తర ఒకటో పాదము. ఆదాయం-5, వ్యయం-5 రాజపూజ్యం-7 అవమానం-7. సమాంతరంగా కనిపిస్తుంది, ఈ సంవత్సరం సింహరాశి వారికి ఉన్నటువంటి పెను సవాళ్లు, పెను సంచలనం ఏమిటంటే అష్టమ శని నడుస్తా ఉంది. అష్టమ శని ముళ్ళు తోటి సమానం. మనం మామూలుగా తెలంగాణ ప్రాంతంలో అయితే సర్కారు తుమ్మ ముల్లు అంటామా లేదా ఈత ముల్లు అంటాము. అది దిగితే కాలుకు, అది గుచ్చుకుంటే కాలుకు చాలా సమస్యలు ఉంటాయి. అదేవిధంగా అష్టమ శని అనేటువంటిది కూడా చాలా చాలా తీవ్రమైనటువంటి సంచలనాలను, సమస్యలను క్రియేట్ చేస్తుంది. మరీ ముఖ్యంగా కన్నుకు సంబంధించి అలాగే ఉదరానికి అంటే కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు రావడం అనేటువంటిది గమనించాల్సి ఉంటుంది. అలాగే తల్లిదండ్రులకు సంబంధించి ఒకళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. మీరు మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు గానీ కిందపడి దెబ్బలు తగిలించుకోవడం, కాళ్ళు చేతులు విరగడం లాంటివి జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో పెను సంచలనం జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ ఉద్యోగస్తులకు సంబంధించి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు బ్యూరోక్రాట్లకు సంబంధించి, సీబీఐ, ఏసీబీ, ఈడీ కేసులు ఉండేటువంటి అవకాశం ఉంది. వ్యాపారస్తులకయితే ట్యాక్స్ పరమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంది.

విద్యార్థులకు సంబంధించి న్యాయపరమైన ఇబ్బందులు గాని, లవ్ లో ఫెయిల్యూర్స్ గాని, లవ్‌లో మోసపోవడం లాంటివి విద్యార్థులకు కనిపిస్తా ఉన్నాయి. ఉత్తీర్ణత శాతం తగ్గే అవకాశం ఉంది, అలాగే చదువులో వెనుకబాటు కనిపిస్తా ఉంది, అలాగే ఇతర వ్యసనాల వల్ల, దుర్వ్యసనాల వల్ల, సమస్యల బారిన పడేటువంటి అవకాశాలు ఈ సంవత్సరము, ఆ విద్యార్థులకు కనిపిస్తా ఉన్నాయి. ఆ వ్యాపారస్తులకు సంబంధించి చాలా వరకు ట్యాక్స్‌ పరమైనటువంటి, ప్రభుత్వ పరమైన ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ టాక్స్ ఇలాంటి ట్యాక్స్‌ పరమైనటువంటి ఇబ్బందుల వల్ల ఆ నష్టపోయేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది.బంధు వర్గంతో కొద్దిగా నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. ఇతరులు మీ పట్ల నరదృష్టిగాను, అసూయగాను, జెలస్ గాను ఫీల్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైతులకు మాత్రం రెండు పంటలు దిగుబడి రాబడి అనుకూలంగా ఉండబోతా ఉంది. బ్లూ కలర్ పంటలు అంటే ఉదాహరణ వంకాయలు, మిర్చి అనేటువంటిది, పత్తి అనేటువంటిది ఈ సంవత్సరం ఎక్కువగా పండేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సింహరాశివారికి ఈ ఏడాది జరగబోయే విషయాలు వేణుస్వామి జోష్యంలో..!


Updated On
ehatv

ehatv

Next Story