2026వ సంవత్సరానికి సంబంధించి తులా రాశి ఫలితాలు. శ్రీ పరాభవ నామ సంవత్సరానికి సంబంధించి తులా రాశి ఫలితాలు, ఇంగ్లీష్లో లిబ్రా అంటారు .

2026వ సంవత్సరానికి సంబంధించి తులా రాశి ఫలితాలు. శ్రీ పరాభవ నామ సంవత్సరానికి సంబంధించి తులా రాశి ఫలితాలు, ఇంగ్లీష్లో లిబ్రా అంటారు .చిత్త మూడు, నాలుగు, స్వాతి ఒకటి, రెండు, మూడు, నాలుగు, పాదములు విశాఖ ఒకటి, రెండు, మూడు, పాదములు. ఆదాయం-5 వ్యయం -14 రాజపూజ్యం-6 అవమానం-3. ఈ సంవత్సరము తులా రాశికి సంబంధించినంతవరకు గురు బలము చాలా విశేషంగా ఉంది. గురు బలము అంటే గురువుల బలము, దైవ బలము చాలా అనుకూలంగా ఉంది. గురువు, శని ఆరో ఇంట్లో ఉన్నప్పటికీ కూడా గురువు విపరీతమైనటువంటి యోగాన్ని ఇవ్వడం చేత నానా విధములుగా అంటే చాలా రకాలుగా డబ్బు అందుబాటులోకి వస్తుంది. ధనాదాయం వస్తుంది కానీ, ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. విద్యార్థులకు విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. మార్కులు ఎక్కువగా వస్తాయి. వీసాలు లభిస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు వస్తాయి, H1 వీసా ఉన్నవారికి ఉద్యోగం వస్తుంది, స్థిర నివాసం ఉంటుంది. అలాగే వివిధ రంగాల్లో ఉండేటువంటి ఉద్యోగస్తులకు ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉంటాయి. గురుబలం వల్ల పై అధికారుల మన్ననలు ఉంటాయి. అలాగే రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి బాగుంటుంది. చేసినటువంటి రుణాలను తీరుస్తారు. అలాగే ఇంట్లో శుభ కార్యాలు నిర్వహిస్తారు. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు ఆదాయము, అవకాశాలు మెరుగుపడతాయి. రాజకీయ నాయకులకు శత్రువుల వల్ల సమస్యలు ఉంటాయి తప్ప, ఆల్మోస్ట్ ఆల్ గా మిగిలిన విషయాలన్నిటిలో అనుకూలత ఉంటుంది, విజయాలు సాధిస్తారు, ఎన్నికలలో, పార్టీలోనూ, ప్రజల్లోనూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. కాకపోతే ఎన్నికల్లో పోటీ చేసే వారికి డబ్బు అధికంగా ఖర్చుఅవుతుంది, కానీ విజయం సిద్ధిస్తుంది. స్త్రీల విషయానికి వచ్చినట్లయితే మీదే పైచేయిగా ఉంటుంది, కుటుంబంలో స్త్రీ మాటనే నెగ్గుతుంది, వ్యాపారస్తులకు ఉమ్మడి, వ్యాపారస్తులకు, రిటైల్ హోల్సేల్ వ్యాపారస్తులకు రూపాయికి వంద రూపాయల లాభం వస్తుంది. అలాగే ఆ కాంట్రాక్టర్లకు సంబంధించి పాత బకాయిలు వసూలవుతాయి. కొత్త కాంట్రాక్టర్లు వస్తాయి. ఏ రంగంలో వారికి ఏ విధమైనటువంటి పరిస్థితులు తీసుకున్నా 90 శాతం అనుకూలంగా తులా రాశి వారికి ఉంది.

Updated On
ehatv

ehatv

Next Story