2026వ సంవత్సరము, శ్రీ పరాభావనామ సంవత్సరానికి సంబంధించి వృశ్చిక రాశి. ఇంగ్లీష్‌లో స్కార్పియో అంటారు. వాటి ఫలితాలను విశేషిద్దాం.

2026వ సంవత్సరము, శ్రీ పరాభావనామ సంవత్సరానికి సంబంధించి వృశ్చిక రాశి. ఇంగ్లీష్‌లో స్కార్పియో అంటారు. వాటి ఫలితాలను విశేషిద్దాం. విశాఖ నాలుగు, అనురాధ 1, రెండు, మూడు, నాలుగు, జేష్ట ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఆదాయం-11 . వ్యయం-5. రాజపూజ్యం-2, అవమానం-4 ఈ సంవత్సరము శని బలం పూర్తి స్థాయిలో కనిపిస్తా ఉన్నది. అలాగే గురువు రాహు-కేతువుల బలము సంపూర్ణంగా మీపై ఉన్నది. కాబట్టి దృష్టి మంచిగా ఉన్నది కాబట్టి, అనుకూలంగా ఉన్నది కాబట్టి, ప్రతి రంగంలో వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. వృశ్చిక రాశి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. అనుకున్న దానికంటే ఎక్కువ మార్కులు సంపాదిస్తారు. అలాగే విదేశీ వీసాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే కోరుకున్నటువంటి యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ లభిస్తాయి. అంటే సీట్లు పొందుతారు. అలాగే విదేశాల్లో ఉండే వారికి విద్యార్థులకు ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తా ఉంది. జీవితంలో స్థిరత్వం ఏర్పరచుకుంటారు.

అలాగే ఉద్యోగస్తులకుపై అధికారుల మన్ననలతో పాటు కోరుకున్న చోటుకి బదిలీలు, ప్రమోషన్లు ఏర్పడతాయి. వ్యవసాయ రంగంలో ఉండేటువంటి. వ్యవసాయదారులకు రెండు పంటలు దిగుబడి రాబడి అధికంగా ఉంటుంది. మరి ముఖ్యంగా పసుపు పంట పండించే వారికి విశేషించి అనుకూలంగా ఉంటుంది. అలాగే చేపలు, రొయ్యలు, వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. పౌల్ట్రీ రంగంలో ఉండే వారికి విశేషించి లాభాకరంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఉమ్మడి మరియు, రిటైల్ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. కాంట్రాక్టర్లకు విపరీతమైనటువంటి ఆదాయం లభిస్తుంది. కొత్త కాంట్రాక్టులు వస్తాయి, పాత బకాయిలు తీరుస్తారు, కళాకారులకు మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా సినిమా రంగంలో ఉండే వారికి, ఆ రాజకీయ రంగంలో ఉండే వారికి విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. ఏ రంగం తీసుకున్నా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము రాజయోగంగా భావించాల్సి ఉంటుంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా స్త్రీలకు అనురాధ నక్షత్రము. అలాగే విశాఖ నాలుగవ పాదం వారికి చాలా చాలా చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. కళాకారులు గాని, క్రీడాకారులు గాని, ఏ రంగం వారైనా సరే చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి నక్షత్రాల వారికి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. కొత్త కొత్త పనులు ప్రారంభిస్తారు, చాలా గొప్పగా కలలు కనండి, కలలను నెరవేర్చుకోండి, మీరు ఎంత గొప్పగా కలలు కంటారో కనండి. చాలా అనుకూలంగా ఉంది. ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఒకటికి 10 అడుగులు ముందుకు వేయండి, వెనక్కి తగ్గకండి కానీ, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఇగోలకి వెళ్ళకండి, ఈ రెండిటిని తగ్గించుకుంటే జీవితంలో చాలా చాలా పైకి వెళ్తారు. ఈ సంవత్సరం అనుకున్నదే తడువుగా మీ ముందుకు వెళ్తారు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి 2026వ సంవత్సరం అనేటువంటిది మహారాజయోగ సంవత్సరంగా భావించాల్సి ఉంటుంది ఓం నమో వెంకటేశాయ


Updated On 9 Dec 2025 10:30 AM GMT
ehatv

ehatv

Next Story