క్రెడిట్ స్కోర్ ఫైనాన్షియల్ లైఫ్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా 300-900 మధ్య సిబిల్, Equifax, Experian వంటి క్రెడిట్ బ్యూరోలు దీన్ని లెక్కిస్తాయి.

క్రెడిట్ స్కోర్ ఫైనాన్షియల్ లైఫ్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా 300-900 మధ్య సిబిల్, Equifax, Experian వంటి క్రెడిట్ బ్యూరోలు దీన్ని లెక్కిస్తాయి. బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు లోన్ ఇచ్చేటప్పుడు క్రెడిట్ స్కోర్ (Credit Score)చూస్తాయి. 750+ స్కోర్ ఉంటే లోన్ సులభంగా, తక్కువ వడ్డీతో వస్తుంది. స్కోర్ ఎక్కువ ఉంటే వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. తక్కువ స్కోర్ ఉంటే రిస్క్ ఎక్కువగా భావించి ఎక్కువ వడ్డీ వసూలు చేస్తారు. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే ప్రీమియం క్రెడిట్ కార్డ్‌లు, ఎక్కువ క్రెడిట్ లిమిట్ సులభంగా దొరుకుతాయి. కొన్ని ఉద్యోగాలు ముఖ్యంగా ఫైనాన్షియల్ సెక్టార్ లేదా ఇంటి అద్దె ఒప్పందాల్లో క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేస్తారు. ఇది ఆర్థిక క్రమశిక్షణను EMI, బిల్ పేమెంట్స్ సకాలంలో చెల్లించడం ప్రతిబింబిస్తుంది. EMI, క్రెడిట్ కార్డ్ బిల్‌ల సకాల చెల్లింపు 35% ప్రభావం చూపిస్తుంది. క్రెడిట్ కార్డులో 30% వినియోగించాలి, కొత్త క్రెడిట్ అప్లికేషన్లు 10% ఎక్కువ లోన్‌లకు అప్లై చేస్తే స్కోర్ తగ్గవచ్చు. 750+ స్కోర్ ఐడియల్. నెలవారీ క్రెడిట్ రిపోర్ట్ తనిఖీ చేసుకోవాలి, బిల్‌లు సకాలంలో చెల్లించు, అనవసర లోన్ ఎంక్వైరీలు తగ్గించుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

ehatv

ehatv

Next Story