ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌(Flipkart) స్పెషల్‌ ఆఫర్లను ప్రకటించింది. గోట్‌ సేల్‌(GOAT Sale) పేరుతో ఈ నెల 20వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ సేల్స్‌ జరుగుతుంది.

ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌(Flipkart) స్పెషల్‌ ఆఫర్లను ప్రకటించింది. గోట్‌ సేల్‌(GOAT Sale) పేరుతో ఈ నెల 20వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ సేల్స్‌ జరుగుతుంది. మరో ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌(amazon) ఈ నెల 20,21వ తేదీలలో అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్స్‌ను(Prime day Special) ప్రకటించిన విషయం తెలిసిందే.

ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ కింద స్మార్ట్ ఫోన్లు, టీవీలు, లాప్‌టాప్‌లు, గృహోపకరణాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీ డిస్కౌంట్లను ఆఫర్‌ చేసింది. ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్లకు ఈ నెల 19 అర్ధరాత్రి నుంచే సేల్స్ అందుబాటులో ఉంటాయి. ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ లో భాగంగా యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ యూపీఐ ద్వారా పేమెంట్స్ చేస్తే 50 రూపాయల డిస్కౌంట్ దొరుకుతుంది. 18 నెలల వరకూ నో-కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కల్పించింది. ఫ్లిప్ కార్ట్ ఫ్లస్ మెంబర్లకు సూపర్ కాయిన్స్ ఆఫర్లు ఉంటాయని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. గోట్‌సేల్స్‌లో కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్లను తక్కువ ధరలకే అమ్ముతున్నారు. అలాగే పాత స్మార్ట్ ఫోన్‌లపై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది.. ఐ-ఫోన్ 15, ఐ-ఫోన్ 14, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎస్ఈ, వివో, ఒప్పో, మోటరోలా, ఇన్‌ఫినిక్స్ తదితర ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ అందిస్తోంది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story