Business Plans: Buying spices in Kerala and selling them in packets in the local market can be a profitable harvest!

ఈ భూమి మీద బంగారంలాంటి పంటలు ఏమైనా ఉన్నాయి అంటే అవి సుగంధ ద్రవ్యాలు అని చెప్పవచ్చు. యాలకులు, మిరియాలు, లవంగాలు వంటి పంటలు కేవలం కేరళ రాష్ట్రం ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనే పండిస్తారు. అందుకే వీటికి ప్రపంచంలో అధిక డిమాండ్‌ ఉంటుంది. కేరళలో పండించే సుంగధ ద్రవ్యాలు ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ఇతర దేశాలకు మంచి క్వాలిటీ ఉన్న స్సైసెస్ ఎగుమతి అవుతుంటాయి. క్వాలిటీని బట్టి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. కేరళలో స్సెసెస్‌ బోర్డు వీటికి గ్రేడింగ్ ఇస్తుంటుంది. మంచి పొడవు, క్వాలిటీ ఉన్న యాలకులను విదేశాలకు పంపిస్తారు. కొంచెం పొడవు తక్కువగా ఉంటే స్థానిక రిటైల్‌ మార్కెట్‌లో ప్యాఇంగ్‌ చేసి అమ్ముకునే అవకాశం ఉంటుంది. కేరళలో విదేశాల ఎగుమతికి రిజెక్ట్ అయిన యాలకులు, లవంగాలు, మిరియాలను లోకల్‌ మార్కెట్‌లో విక్రయిస్తే మంచి లాభాలు పొందే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు చెప్తున్నారు. విదేశాలకు ఎగుమతి కావడానికి అర్హత పొందని యాలకులకు కేరళలోని పలు మార్కెట్‌ యార్డులలో విక్రయిస్తుంటారు. సెకండ్‌ గ్రేడ్‌ యాలకులు ధర కిలో రూ.1800-2000 వేలు ఉంటుంది. అంటే క్వింటాల్‌ ధర రూ.1,80,000-2,00,000 వరకు పలుకుతుంది. థర్డ్‌ గ్రేడ్‌ యాలకులు రూ.1600-1800 వరకు పలుకుతుంది. ఇది క్వింటా రూ. 1,60,000 - రూ. 1,80,000 పలుకుతుంది.

ఉదాహరణకు సెకండ్ గ్రేడ్ యాలకులను ఒక క్వింటాల్‌ రూ.1,70,000 రూపాయలు, ఒక క్వింటా మిరియాలు రూ.68,000, లవంగాలు రూ. 72,000 చొప్పున కొనుగోలు చేస్తే సుమారు మీ పెట్టుబడి రూ. 3,10,000 వరకూ అయ్యే అవకాశం ఉంది. మీరు వీటిని 100 గ్రాముల చొప్పున 1000 ప్యాకెట్లుగా మార్చి విక్రయించుకోవచ్చు. ఉదాహరణకు 100 గ్రాముల యాలకులను రూ. 350 చొప్పున విక్రయించవచ్చు. ఈ లెక్కన మీకు రూ. 3.50 లక్షలు లభిస్తాయి. ఇక మిరియాలు 100 గ్రాములు రూ. 120 చొప్పున విక్రయిస్తే మీకు రూ. 1.20 లక్షలు లభిస్తాయి. అలాగే లవంగాలను 100 గ్రాములు రూ. 180 చొప్పున విక్రయిస్తే రూ. 1,80,000 లభించే వీలుంది. అంటే దాదాపు 80 శాతం వరకూ లాభం పొందవచ్చు.

Updated On
ehatv

ehatv

Next Story