సెలెబ్రిటీల పెళ్లి వేడుక కూడా వ్యాపార వస్తువుగా మారింది. పేరున్న వ్యక్తుల వివాహవేడుకకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు కోట్ల రూపాయలకు అమ్ముడవుతున్నాయి. ఇప్పుడు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ కొడుకు అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ల పెళ్లి జరుగుతున్నది కదా!

సెలెబ్రిటీల పెళ్లి వేడుక కూడా వ్యాపార వస్తువుగా మారింది. పేరున్న వ్యక్తుల వివాహవేడుకకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు కోట్ల రూపాయలకు అమ్ముడవుతున్నాయి. ఇప్పుడు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ(Mukesh Ambani) కొడుకు అనంత్‌ అంబానీ(Anant Ambani)-రాధిక మర్చంట్‌(Radhika Merchant)ల పెళ్లి జరుగుతున్నది కదా! ఆ వేడుకను ప్రసారం చేయడానికి డిస్నీ హాట్‌స్టార్‌ స్ట్రీమింగ్‌(Disney+ Hotstar Wins Streaming Rights of Anant Ambani-Radhika Wedding) హక్కులను దక్కించుకుంది. ఈ నెల 12వ తేదీన పెళ్లి జరగనుంది. అంబానీ అభిమానుల కోసమే కాకుండా మిగతావారు కూడా పెళ్లి కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జులై 12వ తేదీన శుభ్‌ వివాహ్‌తో వేడుక ప్రారంభం కానుంది. జులై 13వ తేదీన శుభ్ ఆశీర్వాద్ జరుగుతుంది. జులై 14వ తేదీన జరిగే మంగళ్ ఉత్సవ్ కార్యక్రమంతో వివాహ వేడుకలు ముగియనున్నాయి. వీటిని హాట్‌స్టార్‌లో చూడవచ్చు. అనంత్ అంబానీ-రాధికల పెళ్లి కనీవినీ ఎరుగని రీతిలో జరగబోతున్నది. ఇప్పటికే రెండు సార్లు ప్రీ వెడ్డింగ్‌ ఈవెంట్లను ఘనంగా నిర్వహించారు. ఇటలీ నుంచి ఫ్రాన్స్‌ వరకు క్రూయిజ్‌లో ప్రయాణిస్తూ రెండో ప్రీ వెడ్డింగ్‌ ఈవెంట్‌ను జరుపుకున్నారు కాబోయే దంపతులు. ఈ మధ్యనే ముఖేశ్‌ అంబానీ కుటుంబం 50 పేద జంటలకు సామూహిక వివాహాలను జరిపించింది. మొత్తం ఖర్చులను భరించింది. కొత్త జంటకు కావాల్సిన ఇంటి సామాగ్రిని అందించింది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story