జీహెచ్ఎంసీలో(GHMC) నిర్మాణ అనుమతుల(construction permits) ఆదాయం దారుణంగా పడిపోయింది

జీహెచ్ఎంసీలో(GHMC) నిర్మాణ అనుమతుల(construction permits) ఆదాయం దారుణంగా పడిపోయింది(revenue decline). 2023-24తో పోలిస్తే ఏకంగా 300కోట్ల ఆదాయం తగ్గిపోయింది. హైదరాబాద్‌లో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు తగ్గడంతో.. జీహెచ్ఎంసీ పట్టణ ప్రణాళికా విభాగం(urban planning department) ఆదాయం గణనీయంగా తగ్గింది. గత మూడు, నాలుగేళ్లతో పోలిస్తే నిర్మాణ అనుమతులు, నివాసయోగ్య పత్రాల జారీ రుసుము రాబడిలో తగ్గుదల కనిపిస్తోంది. కిందటి సంవత్సరం (2023-24)తో పోలిస్తే ఏకంగా రూ.300 కోట్లు, అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2024-25) కంటే రూ.350 కోట్లకుపైగా ఆదాయం తగ్గడం గమనార్హం.

నిర్మాణ అనుమతుల జారీ రుసుమే పట్టణ ప్రణాళికా విభాగానికి ప్రధాన ఆదాయ వనరు. కానీ, ఈ ఏడాది భవన నిర్మాణ అనుమతుల దరఖాస్తులు గణనీయంగా తగ్గాయి. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో రూ.1107.29 కోట్ల ఆదాయం రాగా.. ఏప్రిల్ నుంచి అక్టోబరు 20వ తేదీ వరకు రూ.750 కోట్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఇప్పటి వరకు కేవలం రూ.450 కోట్లు మాత్రమే సమకూరింది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story