బంగారం (Gold)ధరలు మరింత దిగివచ్చాయి. ఆభరణాలకు డిమాండ్‌ తగ్గడంతో తులం బంగారం ధర వెయ్యి రూపాయల(1000 Rupees) వరకు దిగివచ్చింది.

బంగారం (Gold)ధరలు మరింత దిగివచ్చాయి. ఆభరణాలకు డిమాండ్‌ తగ్గడంతో తులం బంగారం ధర వెయ్యి రూపాయల(1000 Rupees) వరకు దిగివచ్చింది. ఢిల్లీ(Delhi)బులియన్‌ మార్కెట్లో తులం బంగారం ధర 950 రూపాయలు తగ్గి 71,050 రూపాయలకు చేరుకుంది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన తులం బంగారం ధర 72 వేల రూపాయల స్థాయిలో ఉన్నదని ఆల్‌ ఇండియా సరాఫా అసోసియేషన్‌ తెలిపింది. పుత్తడితో పాటు వెండి ఏకంగా .4,500 రూపాయలు తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో కిలో వెండి 84,500 రూపాయలకు దిగి వచ్చింది. ధర తగ్గకముందు ఇది 89 వేల రూపాయలు ఉండింది. ప్రస్తుత సంవత్సరంలో ఒకేరోజు ఇంతటి స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి కావడం విశేషం. బడ్జెట్‌లో కస్టమ్స్‌ సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించిన నాటినుంచి ఇప్పటి వరకు బంగారం, వెండి ధరలు తగ్గుతూనే ఉన్నాయి. అయినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర 10.60 డాలర్లు పెరిగి 2,438.50 డాలర్లకు చేరుకుంది. వెండి ధర 28.28 డాలర్ల వద్ద ఉన్నది

Updated On
ehatv

ehatv

Next Story