ఈ రోజు హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి,

ఈ రోజు హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి, 10 గ్రాముల వారీగా 24 క్యారెట్ల బంగారం రూ.96,494, 22 క్యారెట్ల బంగారం రూ. 88,897, వెండి కిలో రూ.96,900. అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం, మెక్సికో, కెనడాపై 25%, చైనా(China)పై ట్రంప్(Trump) 10% అదనపు సుంకాలు ఆర్థిక అస్థిరతను పెంచాయి. దీంతో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తిగా బంగారం వైపు మొగ్గారు. అమెరికన్ డాలర్ బలహీనపడినప్పుడు, బంగారం ధరలు సాధారణంగా పెరుగుతాయి, ఎందుకంటే బంగారం డాలర్లలో ధర నిర్ణయించబడుతుంది. 2025లో డాలర్ విలువలో ఒడిదొడుకులు బంగారం డిమాండ్‌ను పెంచాయి. ఇరాన్-ఇజ్రాయెల్, రష్యా-ఉక్రెయిన్( Russia-Ukraine) యుద్ధాలు వంటి సంఘర్షణలు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా మార్చాయి. చైనా, భారత్, రష్యా వంటి దేశాల కేంద్ర బ్యాంకులు బంగార నిల్వలను పెంచుతున్నాయి. చైనా 2023లో 225 టన్నులు, భారత్ 13 టన్నులు కొనుగోలు చేసింది. ఇది డిమాండ్‌ను పెంచింది. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు, కరెన్సీ విలువ తగ్గడంతో బంగారం కొనుగోళ్లు పెరుగుతాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను సడలించే అంచనాలు కూడా బంగారం ధరలను పెంచాయి. 2024లో బంగారం డిమాండ్ 4,974 టన్నులకు చేరింది, విలువ $382 బిలియన్లు. 2025 ఏప్రిల్ నాటికి, ఔన్సుకు $3,220 అంటే భారత్‌లో 10 గ్రాములకు రూ.93,000 వరకు చేరింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ 10 గ్రాములు రూ.1,00,015కి చేరాయి
