జనవరి-మార్చి మధ్య 41 శాతం పడిపోయిన ఆఫీస్ లీజింగ్.

జనవరి-మార్చి మధ్య 41 శాతం పడిపోయిన ఆఫీస్ లీజింగ్. దేశవ్యాప్తంగా టాప్-7 నగరాల్లో ఈ ఏడాది తొలి మూడు నెలల కాలంలో ఆఫీస్ వసతుల లీజింగ్ మెరుగైన వృద్ధిని చూడగా.. హైదరాబాద్, కోల్‌కతా పట్టణాల్లో క్షీణించిన ఆఫీస్ లీజింగ్. జనవరి-మార్చి త్రైమాసికంలో ఇప్పటి వరకు నమోదైన లావాదేవీల ఆధారంగా ఒక నివేదికను విడుదల చేసిన రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ 'కొలియర్స్ ఇండియా'.టాప్-7 నగరాల్లో స్థూలంగా 159 లక్షల చదరపు అడుగుల మేర (ఎస్ఎఫ్) ఆఫీస్ లీజింగ్ లావాదేవీలు జరగగా.. క్రితం ఏడాది మొదటి మూడు నెలల కాలంలోని లీజింగ్ 138 లక్షల (SF)తో పోల్చి చూస్తే 15 శాతం వృద్ధి నమోదై.. దేశ, విదేశీ కంపెనీల నుంచి బలమైన డిమాండ్ కనిపించింది. హైదరాబాద్‌లో 17 లక్షల చదరపు అడుగుల లీజింగ్ లావాదేవీలు జరగగా.. క్రితం ఏడాది మొదటి మూడు నెలల్లో లీజింగ్ 29 లక్షలతో పోల్చి చూస్తే 41 శాతం తగ్గినట్టు తెలుస్తోంది.

Updated On
ehatv

ehatv

Next Story