హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ డిమాండ్ తగ్గింది. 2024-25లో హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ (Hyderabad Office Space)మార్కెట్‌లో గణనీయమైన క్షీణత కనిపిస్తోంది.

హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ డిమాండ్ తగ్గింది. 2024-25లో హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ (Hyderabad Office Space)మార్కెట్‌లో గణనీయమైన క్షీణత కనిపిస్తోంది. గతంలో దేశంలోని ప్రధాన నగరాలను అధిగమిస్తూ ఆఫీస్ స్పేస్ డిమాండ్‌లో ముందంజలో ఉన్న హైదరాబాద్(Hyderabad), ఇప్పుడు డిమాండ్ లేకపోవడంతో సతమతమవుతోంది. 2024 మొదటి త్రైమాసికంలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 41% పడిపోయింది. 2023 చివరి త్రైమాసికం లో హైదరాబాద్‌లో 2.7 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజ్ అయ్యింది, ఇది బెంగళూరు 2.38 మిలియన్‌ని కూడా అధిగమించింది. కానీ 2024 చివరి త్రైమాసికంలో ఇది 1.26 మిలియన్ చదరపు అడుగులకు పడిపోయింది. అంటే 54% తగ్గుదల కనిపిచింది. ప్రస్తుతం దాదాపు 284 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ఖాళీగా ఉంది. గతంలో హైదరాబాద్‌లో కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ఉత్సాహం చూపిన కంపెనీలు ఇప్పుడు ఆసక్తిని కనపర్చడం లేదు. బీఆర్‌ఎస్ (BRS)పాలనలో ఆఫీస్ స్పేస్ మార్కెట్ జోరుగా ఉండేది, కానీ ప్రస్తుత పాలనలో డిమాండ్‌తో పాటు సప్లై కూడా ఆగిపోయిందని కొన్ని వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఐటీ(IT), ఐటీ అనుబంధ రంగాల నుంచి డిమాండ్ తగ్గడం కూడా ఒక కారణం. ఏడాదిన్నర క్రితం వరకు హైదరాబాద్‌లో ఆఫీస్‌ను ఏర్పాటు చేసేందుకు ఉత్సాహం చూపిన కార్పొరేట్లు.. ప్రస్తుతం ఆసక్తి చూపించడం లేదు. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ విడుదల చేసిన తాజా గణాంకాలే ఇందుకు నిదర్శనం. హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ డిమాండ్ గత ఏడాదితో పోలిస్తే భారీగా తగ్గింది, ఖాళీలు పెరిగాయి, కంపెనీల ఆసక్తి సన్నగిల్లింది. ఈ ట్రెండ్ కొనసాగితే నగర రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై ప్రభావం పడవచ్చు.
ఇప్పటికే నిర్మాణం పూర్తయ్యి అందుబాటులో ఉన్న ఆఫీస్ స్పేస్‌కు గిరాకీ అంతంతమాత్రంగానే ఉండటంతో కొత్త నిర్మాణాలు దాదాపుగా ఆగిపోయాయి. రియల్టర్లు, ఆఫీస్ స్పేస్ నిర్మాణ కంపెనీలు నూతన ప్రాజెక్టులకు దూరంగా ఉంటున్నాయి. ఫలితంగా సిమెంట్, ఉక్కు, ఇతర నిర్మాణ అనుబంధ రంగాలు కుదేలయ్యాయి. వాటిమీద ఆధారపడుతున్న పరిశ్రమలు, వ్యాపారులు, ఉద్యోగులు, కూలీల భవిష్యత్తు ఆందోళనలో పడింది. నిజానికి హైదరాబాద్‌లో ఖాళీగా ఉన్న కార్యాలయ స్థలాలు మునుపు ఇంకా ఎక్కువ (19 శాతం)గానే ఉండేవి. కానీ కొత్త ప్రాజెక్టులు రాకపోవడంతో ఇవి కాస్త తగ్గాయి. కాగా, హైదరాబాద్, ఢిల్లీ(Delhi)-ఎన్‌సీఆర్(NCR), బెంగళూరు(Bangalore ), ముంబై (Mumbai), చెన్నై(Chennai), కోల్‌కతా(Kolkata), పుణె(Pune) నగరాలపై వెస్టియన్ సర్వే చేసింది.
విభజన అనంతరం తెలంగాణ(Telangana)లో పరుగులు పెట్టింది. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) నిర్ణయాలు అన్ని రంగాలను బలపర్చాయి. ఐటీ, ఫార్మా, ఆటో, ఏవియేషన్, డిఫెన్స్ ఇలా కీలక రంగాలు వృద్ధిపథంలో నడిచాయి. దీంతో ఇక్కడి నిర్మాణ రంగానికి ఊహించని స్థాయిలో డిమాండ్‌ను తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఆఫీస్ స్పేస్‌కు గిరాకీని అమాంతం పెంచేసింది. దేశ, విదేశీ సంస్థలు హైదరాబాద్‌లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు భారీగా ముందుకొచ్చాయి. భారత్‌లోకి రావాలంటే హైదరాబాద్‌నే ప్రధాన కేంద్రంగా చేసుకోవాలన్నంతగా డిమాండ్ నెలకొందంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్(Microsoft), గూగుల్(Google), అమెజాన్ (Amazon)వంటి అనేక సంస్థలు హైదరాబాద్‌లో బడాబడా ఆఫీసులను తీసుకొచ్చాయి. మరెన్నో స్టార్టప్‌లూ కొలువుదీరాయి. ఫలితంగా ఆఫీస్ మార్కెట్ వేగంగా విస్తరించింది. కానీ ఏడాదిన్నరగా పెట్టుబడులు రాక మార్కెట్ నెమ్మదించింది.
