మూడు రోజులుగా ఇండియా పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు పెరిగిపోయాయి.

మూడు రోజులుగా ఇండియా పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఈరోజు తెల్లవారుజామున ఇండియాపై తాము యుద్ధానికి దిగుతున్నట్లు ప్రకటించిన పాక్ దానికి 'బన్‌యన్ ఉల్ మర్సూస్' (anyan Ul Marsoos)అంటూ పేరు పెట్టింది. దీని ద్వారా ఇండియాపై పూర్తి స్థాయి మిలిటరీ ఆపరేషన్ నిర్వహించనున్నట్లు అధికారికంగా చెప్పింది. అయితే ఈ పరిస్థితులతో ఉత్తర భారతదేశం(India)లోని అనేక రాష్ట్రాల్లోని ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటున్న అనేక కార్పొరేట్ కంపెనీలు దానికి అనుగుణంగా ఉద్యోగులకు కీలక సూచనలు చేస్తున్నాయి. తాజాగా దేశంలో టాప్-5 ఐటీ కంపెనీల్లో ఒకటిగా ఉన్న హెచ్‌సీఎల్ టెక్నాలజీస్(HCL Technologies) గురుగ్రాము(Gurugram), నోయిడా(Noida), చండీఘడ్(Chandigarh) నగరాల్లోని తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్( Work-From-Home) సౌకర్యాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. అయితే దీనిని ఎంతకాలం పొడిగించాలనే విషయంపై ఆదివారం నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. స్థానిక ప్రభుత్వ అధికారుల సూచనల మేరకు ఈ నిర్ణయం ఉంటుందని కంపెనీ వెల్లడించింది.ప్రస్తుతం పాకిస్థాన్(Pakistan), భారత్ ఒకరిపై మరొకరు దాడులకు దిగుతున్న వేళ భద్రతాపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని టెక్ దిగ్గజం ముందస్తుగా అప్రమత్తం అయ్యింది. ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్న కంపెనీ ఈ మేరకు వారిని ఇంటి వద్ద నుంచే పనిచేయాలని శుక్రవారం సూచించింది. పాక్ ప్రస్తుతం పంజాబ్(punjab), జమ్మూ కశ్మీర్ (jammu kashmir)లోని అనేక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు, మిస్సైల్ దాడులు చేస్తున్నప్పటికీ వాటిని సమర్థవంతంగా భారత ఆర్మీ (Indian Army)కూల్చివేస్తోంది.ఇప్పటికే ప్రముఖ కంపెనీ ఈవై కూడా తన ఉద్యోగులను ఇంటి వద్ద నుంచే పనిచేయాలని సూచించిన సంగతి తెలిసిందే. మరిన్ని కంపెనీలు స్థానిక సెక్యూరిటీ పరిస్థితులకు అనుగుణంగా అనేక నగరాల్లోని తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటును కల్పిస్తున్నాయి.
