ఇండియన్ బ్యాంకులు కొన్ని రుణాల వడ్డీ రేట్లను తగ్గించాయి, ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 2025 ఫిబ్రవరిలో 25 బేసిస్ పాయింట్లు 6.5% నుంచి 6.25%, ఏప్రిల్ 9, 2025న మరో 25 బేసిస్ పాయింట్లు (6.25% నుంచి 6%) తగ్గించిన తర్వాత. ఈ రెపో రేట్ కట్ వల్ల హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్(Vehicle loan), పర్సనల్ లోన్స్ వంటి రుణాలపై వడ్డీ రేట్లు కొంతమేర తగ్గే అవకాశం ఉంది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Union Bank of India), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(Maharasta), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి బ్యాంకులు హోమ్ లోన్(Home loan) రేట్లను 8.1% నుంచి 8.25% వరకు ఆఫర్ చేస్తున్నాయి. ఇవి రెపో రేట్‌తో లింక్ అయిన రేట్లు, కాబట్టి రెపో రేట్ తగ్గిన తర్వాత మరింత తగ్గే ఛాన్స్ ఉంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 15, 2025 నుంచి హోమ్ లోన్ రేట్లను 8.25% నుంచి 9.2% వరకు సవరించింది, ఇది క్రెడిట్ స్కోర్, లోన్ అమౌంట్‌పై ఆధారపడి ఉంటుంది.

HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ వంటివి 8.5% నుంచి 8.75% పరిధిలో హోమ్ లోన్ రేట్లు ఆఫర్ చేస్తున్నాయి, కానీ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులతో పోలిస్తే ఇవి కొంచెం ఎక్కువే.

కొన్ని బ్యాంకులు కారు లోన్స్‌పై రేట్లను 8.5% నుంచి ఆఫర్ చేస్తున్నాయి, కానీ రెపో రేట్ కట్ తర్వాత మరికొన్ని బ్యాంకులు స్వల్ప తగ్గింపు చేసే అవకాశం ఉంది. పర్సనల్ లోన్ రేట్లు 10% నుంచి ప్రారంభమవుతాయి, కానీ రెపో రేట్ తగ్గడం వల్ల కొన్ని బ్యాంకులు 0.25% నుంచి 0.5% వరకు తగ్గించే ఛాన్స్ ఉంది. రెపో రేట్ తగ్గడం వల్ల బ్యాంకులకు ఫండింగ్ ఖర్చు తగ్గుతుంది, దీనితో లోన్ రేట్లను సర్దుబాటు చేస్తాయి. ఫిబ్రవరి 2025లో CPI ఇన్‌ఫ్లేషన్ 3.6%కి తగ్గింది, దీనితో RBI ఎకానమీని బూస్ట్ చేయడానికి రేట్లు తగ్గించింది. రెపో రేట్‌తో లింక్ అయినా ఫ్లోటింగ్ రేట్ లోన్స్‌కి తగ్గింపు త్వరగా వర్తిస్తుంది. ఫిక్స్‌డ్ రేట్ లోన్స్‌పై ఎఫెక్ట్ ఉండదు. అన్ని బ్యాంకులూ ఒకే సమయంలో రేట్లు తగ్గించకపోవచ్చు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు త్వరగా స్పందిస్తాయి, ప్రైవేట్ బ్యాంకులు కొంచెం ఆలస్యం చేసే అవకాశం ఉంది.

ehatv

ehatv

Next Story