లీనా గాంధీ తివారీ (Leena Tewari)ముంబై(Mumbai)లోని వర్లీ ప్రాంతంలో రూ. 639 కోట్లకు రెండు సీ-ఫేసింగ్ లగ్జరీ డూప్లెక్స్ ఫ్లాట్‌లను కొనుగోలు చేసింది

లీనా గాంధీ తివారీ (Leena Tewari)ముంబై(Mumbai)లోని వర్లీ ప్రాంతంలో రూ. 639 కోట్లకు రెండు సీ-ఫేసింగ్ లగ్జరీ డూప్లెక్స్ ఫ్లాట్‌లను కొనుగోలు చేసింది, ఇది భారతదేశంలోనే అత్యం ఖరీదైన రెసిడెన్షియల్ ప్రాపర్టీ డీల్‌గా రికార్డు సృష్టించింది. ఈ ఫ్లాట్‌లు నమన్ జనా అనే 40 అంతస్తుల సూపర్-ప్రీమియం టవర్‌లో 32 నుంచి 35వ అంతస్తుల వరకు 22,572 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. ఒక్కో చదరపు అడుగు ధర దాదాపు రూ. 2.83 లక్షలు. స్టాంప్ డ్యూటీ, జీఎస్టీ కలిపి రూ. 63.9 కోట్లు అదనంగా చెల్లించింది, మొత్తం డీల్ విలువ దాదాపు రూ. 703 కోట్లు. లీనా యూఎస్‌వీ ఫార్మాస్యూటికల్స్(USV Pharmaceuticals) చైర్‌పర్సన్, ఆమె నెట్ వర్త్ ఫోర్బ్స్ ప్రకారం 2025 సుమారు రూ. 32,500 కోట్లు. ఆమె తన వ్యాపారం, వ్యక్తిగత జీవితాన్ని చాలా లో-ప్రొఫైల్‌గా ఉంచుతుంది.

Updated On
ehatv

ehatv

Next Story