13 ఏళ్లకే ఓ కంపెనీకి సీఈవోగా(CEO) మారి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు భారతీయుడు.

13 ఏళ్లకే ఓ కంపెనీకి సీఈవోగా(CEO) మారి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు భారతీయుడు. 9 సంవత్సరాల వయస్సులో యాప్‌ని(APP) అభివృద్ధి చేశాడు, 13 సంవత్సరాల వయస్సులో తన సొంత కంపెనీని(COmpany) ప్రారంభించాడు. కేరళకు చెందిన ఆదిత్యన్ రాజేష్(Adityan rajesh) విజయవంతమైన ఐటీ వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు. చాలా మంది పిల్లలు పాఠశాల ఒత్తిడి, సామాజిక ఒత్తిళ్లతో పోరాడుతున్న సమయంలో 13 ఏళ్ల వయసులోనే ట్రినెట్ సొల్యూషన్స్ అనే వెబ్ డిజైన్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీని స్థాపించాడు. దుబాయ్‌లో ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆదిత్యన్ విజయ ప్రయాణం ఇతర యువకులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
9 సంవత్సరాల చిన్న వయస్సులో అతను మొదటి మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించాడు. యాప్ డెవలపర్, కంపెనీ యజమానిగా ఉండటమే కాకుండా, ఖాతాదారుల కోసం లోగోలు, వెబ్సైట్లను రూపొందిస్తున్నాడు. కేరళలోని తిరువిల్లాలో ఆదిత్యను జన్మించాడు. ఐదేళ్ల వయసులో తన కుటుంబం దుబాయ్‌కి తరలివెళ్లింది. అక్కడ తన తండ్రి మొదటి వెబ్సైట్ BBC టైపింగ్ చూపించాడు. ఆ సమయంలో పెద్దగా స్నేహితులు లేకపోవడంతో కంప్యూటర్ల పట్ల అతను ఆకర్షితులయ్యాడు. ఆరేళ్ల వయసులో యూట్యూబ్‌లో కార్టూన్లు చదవడం, స్పెల్లింగ్ బీ గేమ్‌లు ఆడడం వంటి వాటితో ఎక్కువ సమయం గడిపేవాడు. ఆదిత్యన్ తన ముగ్గురు స్కూల్ స్నేహితుల భాగస్వామ్యంతో తన ఐటీ కంపెనీని నడుపుతున్నాడు. 12 మంది క్లయింట్ల కోసం ప్రాజెక్ట్‌లను విజయవంతంగా పూర్తి చేశారు. ట్రినెట్ సొల్యూషన్స్ వ్యాపారాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని చూస్తున్నారు. iOS పరికరాల కోసం యాప్‌లను రూపొందించాలని ఆదిత్యన్ . ప్రస్తుతం, ఆదిత్యన్ తన పాఠశాల ఉపాధ్యాయుల కోసం క్లాస్ మేనేజ్మెంట్ యాప్‌లో పని చేస్తున్నాడు. వివిధ ప్రాజెక్ట్‌లలో తన తోటి క్లాస్మేట్లకు సాంకేతిక సహాయాన్ని కూడా అందిస్తున్నాడు.
