వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ పేరు తెలియని వారు ప్రపంచవ్యాప్తంగా ఎవరూ లేరంటే అతిశయోక్తి లేదు.

వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ పేరు తెలియని వారు ప్రపంచవ్యాప్తంగా ఎవరూ లేరంటే అతిశయోక్తి లేదు. వ్యాపార రంగంలో తనదైన ముద్రవేసిన ముకేశ్, దేశంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. ముకేశ్ అంబానీ మాత్రమే కాదు వారి కుటుంబ సభ్యులు కూడా ఆయా రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నవారే. తాజాగా అంబానీ కుటుంబం ఓ రికార్డ్ సృష్టించింది. ఆసియాలోనే అత్యంత సంపన్న కుటుంబంగా నిలిచింది. ఆసియాలోనే అత్యంత సంపన్న కుటుంబంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ కుటుంబం నిలిచింది. ఆసియాలో అత్యంత సంపన్నులైన 20 కుటుంబాల జాబితాను బ్లూమ్‌బర్గ్ నివేదిక విడుదల చేసింది. ఇందులో 90.5 బిలియన్ డాలర్ల (రూ.7.86 లక్షల కోట్ల) సంపదతో ముకేశ్ అంబానీ కుటుంబం అగ్రస్థానంలో నిలిచినట్టు వెల్లడించింది. 31 జనవరి 2025 వరకు ఉన్న డేటా ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ ప్రకటించారు.
