రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు (0.5%) తగ్గిస్తే, అది ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపుతుంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు (0.5%) తగ్గిస్తే, అది ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. రెపో రేటు అనేది RBI కమర్షియల్ బ్యాంకులకు రుణాలు ఇచ్చే వడ్డీ రేటు. దీనిని తగ్గించడం వల్ల బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుతో RBI నుండి రుణాలు పొందవచ్చు, దీని ఫలితంగా బ్యాంకర్లు కస్టమర్లకు అందించే రుణాలపై వడ్డీ రేట్లు కూడా తగ్గే అవకాశం ఉంది.
ఒక రూ.50 లక్షల హోమ్ లోన్‌పై వడ్డీ రేటు 8.5% నుండి 8%కి తగ్గితే, నెలవారీ ఈఎంఐ రూ.795 వరకు తగ్గవచ్చు.. 20 సంవత్సరాల టెన్యూర్ ఆధారంగా). అయితే ఈ తగ్గింపు బ్యాంకులు ఎంతవరకు ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తాయనే దానిపై ఆధారపడి ఉంటుంది. రెపో రేటు (Repo Rate )తగ్గడం వల్ల బ్యాంకులు( FD)లపై వడ్డీ రేట్లను కూడా తగ్గించవచ్చు. ఫిబ్రవరి 2025 నుంచి కొన్ని బ్యాంకులు FD రేట్లను 30-70 బేసిస్ పాయింట్లు తగ్గించాయి. ఇది డిపాజిటర్లకు ప్రతికూలంగా ఉంటుంది. వారి సేవింగ్స్‌పై రాబడి తగ్గుతుంది.
రెపో రేటు తగ్గడం వల్ల బ్యాంకులు ఎక్కువ రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది వ్యాపారాలు, వినియోగదారుల ఖర్చును పెంచుతుంది. ఇది ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తుంది, ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాలు వృద్ది చెందుతాయి. హోమ్ లోన్‌లు(home loans), వాహన రుణాలు(vehicle loans), ఇతర రిటైల్ లోన్‌లపై EMIలు తగ్గే అవకాశం ఉంది, ముఖ్యంగా రెపో-లింక్డ్ రుణాలకు. అయితే, బ్యాంకులు ఈ ప్రయోజనాన్ని పూర్తిగా బదిలీ చేయకపోతే, EMIలలో తగ్గింపు పరిమితంగా ఉండవచ్చు.
