ప్రతి నెల 1వ తేదీ నుండి కొన్ని నియమాలు మారుతాయి. ఈరోజు అక్టోబర్ 1. ఈ నెలలో కూడా చాలా మార్పులు జరగబోతున్నాయి. ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందాలపై అధిక GST నుండి డెబిట్-క్రెడిట్ కార్డ్ నెట్‌వర్క్‌ను ఎంచుకునే సౌలభ్యం వరకు మార్పులు ఇందులో ఉన్నాయి.

Seven big rules have changed from today
ప్రతి నెల 1వ తేదీ నుండి కొన్ని నియమాలు మారుతాయి. ఈరోజు అక్టోబర్ 1. ఈ నెలలో కూడా చాలా మార్పులు జరగబోతున్నాయి. ఆన్‌లైన్ గేమింగ్(Online Gaming), క్యాసినో(Casino)లు, గుర్రపు పందాలపై అధిక GST నుండి డెబిట్(Debit)-క్రెడిట్(Credit) కార్డ్ నెట్‌వర్క్(Network)ను ఎంచుకునే సౌలభ్యం వరకు మార్పులు ఇందులో ఉన్నాయి. కొన్ని మార్పులు జేబుపై భారాన్ని పెంచనుండగా.. మరికొన్ని లాభదాయకంగా ఉండనున్నాయి. నేటి నుంచి చోటుచేసుకుంటున్న మార్పులను తెలుసుకుందాం.
క్రెడిట్-డెబిట్ కార్డ్ నెట్‌వర్క్‌ని మార్చే అవకాశం..
అక్టోబర్ 1 నుండి క్రెడిట్, డెబిట్, ప్రీపెయిడ్ కార్డ్ హోల్డర్లంద(Prepaid Card Holders)రూ తమ నెట్‌వర్క్(Network)ను మార్చుకోవచ్చు. ఇది ఖచ్చితంగా మొబైల్ నంబర్ నెట్‌వర్క్‌ను మార్చినట్లుగా ఉంటుంది. కొత్త నియమం ప్రకారం.. వీసా కార్డ్ హోల్డర్లు(Visa Card Holders).. తమ కార్డ్‌లను మాస్టర్ కార్డ్(Master Card) లేదా రూపే(Rupay) లేదా ఇతర నెట్‌వర్క్‌లకు మార్చుకోవచ్చు. దీని కోసం వారు ఖాతాలను మార్చాల్సిన అవసరం లేదు. అలాగే కార్డ్ హోల్డర్ క్రెడిట్ హిస్టరీలో ఎలాంటి మార్పు కూడా ఉండదు. ఈ మార్పు వ్యక్తులు తమకు నచ్చిన నెట్‌వర్క్‌ను ఎంచుకోవడానికి సహాయపడుతుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ కార్డ్ హోల్డర్‌లకు నెట్‌వర్క్‌లను మార్చుకునే అవకాశాన్ని అందిస్తాయి. భారతదేశంలో ప్రస్తుతం ఐదు కార్డ్ నెట్‌వర్క్‌లు ఉన్నాయి. వీటిలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్ప్, డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్, మాస్టర్ కార్డ్ ఆసియా, NPCI-Rupay, Visa Worldwide Pte Ltd ఉన్నాయి.
విదేశాలకు ప్రయాణాలపై అధిక పన్ను..
ఇప్పుడు మీరు విదేశాలకు వెళ్లడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తే.. మీరు మరింత పన్ను చెల్లించాలి. అక్టోబర్ 1 తర్వాత రూ. 7 లక్షల కంటే ఎక్కువ విదేశీ ప్రయాణ ఖర్చులపై 20 శాతం TCS (మూలం వద్ద వసూలు చేయబడిన పన్ను) చెల్లించాలి. అదేవిధంగా ఆర్‌బిఐ యొక్క లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) కింద.. విదేశాలకు డబ్బు పంపడానికి 5 శాతానికి బదులుగా 20 శాతం టిసిఎస్ చెల్లించాలి. అయితే విదేశాలకు విద్య లేదా చికిత్స కోసం రూ.7 లక్షల కంటే ఎక్కువ పంపితే పన్ను రేట్లలో ఎలాంటి మార్పు లేదు. ఇది కాకుండా ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందాలపై 28 శాతం జీఎస్టీని అక్టోబర్ 1 నుంచి విధించనున్నారు.
CNG-PNG రేట్లు పెరిగే అవకాశం..
సెప్టెంబరులో MMBTUకి $8.60 ఉన్న సహజ వాయువు ధరను ప్రభుత్వం అక్టోబర్ నెలలో $9.20కి పెంచింది. ఈ సహజ వాయువు ధర అక్టోబర్ 31 వరకు అమలులో ఉంటుంది. ఈ ధరల పెరుగుదల నేపథ్యంలో గ్యాస్ పంపిణీ సంస్థలు CNG, PNG ధరలను పెంచే అవకాశం ఉంది. సిఎన్‌జిని వాహనాల్లో ఉపయోగిస్తుండగా.. పిఎన్‌జిని ఇళ్లలో వంట చేయడానికి ఉపయోగిస్తారు.
వాహనాల ధరలు పెరిగే అవకాశం..
చాలా వాహనాల తయారీ కంపెనీలు అక్టోబర్ 1 నుంచి తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఇందులో ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాల తయారీ కంపెనీలు కూడా ఉన్నాయి. ధరలపెరుగుదల వాహనం యొక్క మోడల్ ప్రకారం మారుతూ ఉంటుంది. అంటే నేటి నుంచి ద్విచక్ర వాహనం లేదా నాలుగు చక్రాల వాహనం కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఎక్కువ డబ్బు వెచ్చించాల్సి వస్తుంది.
RD పై ఎక్కువ వడ్డీ..
చిన్న పొదుపు పథకాల వడ్డీ రేటు అక్టోబర్-డిసెంబర్ 2023కి నిర్ణయించబడింది. ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ (ఆర్‌డీ)పై వడ్డీని 6.5 శాతం నుంచి 6.7 శాతానికి పెంచారు. అంటే వడ్డీని 20 బేసిస్ పాయింట్లు పెంచారు. ఇతర చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేటు సెప్టెంబర్ త్రైమాసికంలో ఉన్నట్లే ఉంచబడింది.
చిన్న పొదుపు పథకాల ఖాతాలు నిలిపివేత
దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు PPF, NSC, సుకన్య సమృద్ధి వంటి చిన్న పథకాలలో పెట్టుబడి పెడుతున్నారు. ఈ పొదుపు పథకాల ఖాతాలను యాక్టివ్‌గా ఉంచడానికి.. ఖాతాదారులు తమ పాన్, ఆధార్ వివరాలను సెప్టెంబర్ 30లోగా అందించడం తప్పనిసరి. అలా చేయని వారి ఖాతాలను అక్టోబర్ 1 తర్వాత సస్పెండ్ చేసే అవకాశం ఉంది. ఖాతాదారులు తమ బ్యాంక్ లేదా పోస్టాఫీసు బ్రాంచ్ నుండి దీనికి సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు.
జనన ధృవీకరణ పత్రం పరిధి పెంపు
కేంద్ర ప్రభుత్వం జనన మరణాల నమోదు చట్టాన్ని సవరించింది. సవరించిన నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. కొత్త నిబంధనల అమలుతో జనన ధృవీకరణ పత్రం పరిధి పెరుగుతుంది. ఆధార్ కోసం, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు జాబితాలో పేరు చేర్చడం, విద్యా సంస్థలో అడ్మిషన్, వివాహ నమోదు, ప్రభుత్వ ఉద్యోగం పొందడం కోసం జనన ధృవీకరణ పత్రం ఒక సర్టిఫికేట్‌గా చెల్లుబాటు అవుతుంది.
