వినియోగదారులకు సిల్వర్ షాక్ ఇస్తోంది. ఈ మధ్యనే 2 లక్షల మార్కు దాటి రికార్డ్ సృష్టించిన వెండి.. ఇప్పుడు 3 లక్షల మార్కుకు పరుగులు పెడుతోంది.

వినియోగదారులకు సిల్వర్ షాక్ ఇస్తోంది. ఈ మధ్యనే 2 లక్షల మార్కు దాటి రికార్డ్ సృష్టించిన వెండి.. ఇప్పుడు 3 లక్షల మార్కుకు పరుగులు పెడుతోంది. ఈరోజు ఒక్కరోజే ఏకంగా రూ.10,000 పెరిగింది. ఇంకోవైపు బంగారం కూడా అదే రీతిగా పరుగులు పెడుతోంది. నిన్న భారీగా పెరిగిన బంగారం ధర.. ఈరోజు కూడా మరోసారి పెరిగింది. గోల్డ్ ధర కూడా కొత్త రికార్డ్‌లు క్రియేట్ చేయబోతుంది. దీంతో బంగారం, వెండి కొనాలంటేనే కొనుగోలుదారులు భయపడిపోతున్నారు. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.380 పెరిగి.. రూ.1,38,930 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 350 పెరిగి రూ.1,27,350 దగ్గర అమ్ముడవుతోంది. ఇక సిల్వర్ ధర ఇస్రో ప్రయోగించిన బాహుబాలి రాకెట్‌లో. ఈరోజు కిలో వెండిపై రూ.10,000 పెరిగింది. దీంతో సరికొత్త రికార్డ్ స్థాయిలో ధర దూసుకుపోతుంది. బులియన్ మార్కెట్‌లో ఈరోజు కిలో వెండి ధర రూ.2,33,000 దగ్గర ఉండగా.. హైదరాబాద్, చెన్నై బులియన్ మార్కెట్‌లో మాత్రం రూ.2,44,000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.2,33,000 దగ్గర ట్రేడ్ అవుతోంది.


