గత వారం లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి.

గత వారం లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 620 పాయింట్ల నష్టంతో 76,895 వద్ద, నిఫ్టీ 211 పాయింట్లు నష్టపోయి 23,260 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.16గా ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సూచీల క్షీణతతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 424 లక్షల కోట్ల నుంచి రూ. 419 లక్షల కోట్లకు క్షీణించింది. ఇన్వెస్టర్ల సంపద రూ. 5 లక్షల కోట్లు ఆవిరైంది. ఈరోజు మార్కెట్ల నష్టాలకు ముఖ్యంగా 5 కారాణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story