టెస్లా కార్లను భారత్‌లో అమ్మేందుకు ఎలాన్‌ మస్క్‌ రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

టెస్లా కార్లను భారత్‌లో అమ్మేందుకు ఎలాన్‌ మస్క్‌ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. జూలైలో ముంబయిలో షోరూమ్‌ ప్రారంభించనున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. యూరప్‌, చైనా వ్యాప్తంగా ఈ కార్ల అమ్మకాలు క్షీణించడం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌(Donald Trump), మస్క్‌ మధ్య ఇటీవల జరిగిన మాటల యుద్ధం నేపథ్యంలో టెస్లా (Tesla)షేర్లు క్షీణించాయి. ట్రంప్‌ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారని తెలిసిన క్షణం నుంచి కొంత కాలంపాటు టెస్లా అ‍మ్మకాలు జోరందుకున్నాయి. అయితే ఇటీవల ఇద్దరి మధ్య మాటల యుద్ధం ముదరడంతో అమ్మకాలు డీలా పడ్డాయి. దాంతోపాటు చైనా(China)లోనూ టారిఫ్‌ భయాలతో టెస్లా అమ్మకాలు పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో మస్క్‌(Mask)కు భారత్‌ భారీ మార్కెట్‌గా కనపడుతోంది. ఇప్పటికే దేశంలో టెస్లా అమ్మకాలు ప్రారంభిస్తామని కంపెనీ ప్రకటించింది. యూరప్, చైనాల్లో అమ్మకాలు క్షీణించిన నేపథ్యంలో టెస్లా ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌ అయిన భారత్‌లో తన కార్యకలాపాలు విస్తరించడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా టెస్లా వచ్చే నెలలో ముంబయిలో తన మొదటి షోరూమ్‌ను ప్రారంభించనుందని బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. ముంబయిలో షోరూమ్‌ ప్రారంభించిన తర్వాత ఢిల్లీలో షోరూమ్‌ ఓపెన్‌ చేస్తుందని సమాచారం. ఇప్పటికే టెస్లా కంపెనీ అమెరికా, చైనా, నెదర్లాండ్స్ నుంచి సూపర్ ఛార్జర్ కాంపోనెంట్స్, కార్ యాక్సెసరీస్, మర్కండైజ్, విడిభాగాలను దిగుమతి చేసుకుందని బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది.

ehatv

ehatv

Next Story