కొత్త నెల ప్రారంభమైనప్పుడల్లా కొన్ని మార్పులు గమనిస్తూ వస్తున్నాం. ఈ నెలలో కూడా ఆ మార్పులు ఉన్నాయి. ఈ మార్పులు మీ నెలవారీ బడ్జెట్‌పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనున్నాయి.

These Rule Change From 1st September 2023 LPG Price Credit Card to IPO listing day know all details here tutd
కొత్త నెల ప్రారంభమైనప్పుడల్లా కొన్ని మార్పులు గమనిస్తూ వస్తున్నాం. ఈ నెలలో కూడా ఆ మార్పులు ఉన్నాయి. ఈ మార్పులు మీ నెలవారీ బడ్జెట్‌పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనున్నాయి. ఎల్పీజీ సిలిండర్ ధరలతో సహా అనేక ఇతర పెద్ద మార్పులు ఉండనున్నాయి.
LPG ధర మార్పులు
దేశవ్యాప్తంగా చమురు, గ్యాస్ పంపిణీ సంస్థలు గ్యాస్ ధరలను తగ్గించాయి. దేశీయంగా ఎల్‌పీజీ ధరలను తగ్గించాలని రెండు రోజుల ముందే నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్ల ధరలను రూ.200 తగ్గించింది. ఉజ్వల యోజన లబ్ధిదారునికి అదనపు మినహాయింపు ఇవ్వబడుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ రూ.903కి అందుబాటులో ఉంది. డొమెస్టిక్ సిలిండర్ ధరలతో పాటు వాణిజ్య సిలిండర్ ధరలను కూడా తగ్గించారు. వాణిజ్య సిలిండర్ల ధరలను రూ.158 తగ్గించారు.
క్రెడిట్ కార్డ్ నియమాలు
దేశంలోని ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం..సెప్టెంబర్ 1, 2023న మాగ్నస్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు కొన్ని లావాదేవీలపై ఎలాంటి తగ్గింపును పొందరు. ఇది కాకుండా.. వారు పలు ఛార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది.
ఉచిత ఆధార్ కార్డ్ అప్‌డేట్
UIDAI ప్రకారం.. ఆధార్ వినియోగదారులు ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. దీని గడువు 14 సెప్టెంబర్ 2023. మీరు ఆధార్ కార్డ్‌ని ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. అయితే.. ఆధార్ అప్‌డేట్‌కు మీరు సెంటర్‌కు వెళ్తే రూ. 50 చెల్లించాలి.
రూ.2,000 నోటు మార్పిడి
2000 రూపాయల నోటును మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి ఆర్బీఐI చివరి తేదీని సెప్టెంబర్ 30, 2023గా నిర్ణయించింది. అంటే మీరు ఈ నెల చివరి వరకూ 2000 రూపాయల నోట్లను మార్చుకోవచ్చు.
మ్యూచువల్ ఫండ్ నిబంధనలలో మార్పులు
మ్యూచువల్ ఫండ్ పథకాల ప్రత్యక్ష పథకాల కోసం సెబీ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రవేశపెట్టింది. ఈ నిబంధనలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. ఈ నిబంధనల ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌తో వ్యాపారం చేయడం చాలా సులభం అవుతుంది.
IPO నియమాలలో మార్పులు
IPO లిస్టింగ్ నియమాలు కూడా మార్చబడ్డాయి. ఇప్పుడు IPO 6 రోజుల పాటు పెట్టుబడిదారులకు తెరిచి ఉంటుంది. ఇంతకుముందు IPO పెట్టుబడిదారులకు 3 రోజులు మాత్రమే అందుబాటులో ఉండేది. ఈ నియమం 1 సెప్టెంబర్ 2023 నుండి అంటే నేటి నుండి వర్తిస్తుంది.
వ్యవసాయ సెస్‌లో మినహాయింపు
ఎల్‌పిజి, లిక్విఫైడ్ ప్రొపేన్, లిక్విఫైడ్ బ్యూటేన్ దిగుమతులపై ప్రభుత్వం శుక్రవారం నుండి 15 శాతం వ్యవసాయ సెస్ నుండి మినహాయించింది. జూలైలో ఈ వస్తువుల దిగుమతిపై ప్రభుత్వం 15 శాతం వ్యవసాయ సెస్ విధించింది. ఎల్‌పిజి, లిక్విఫైడ్ ప్రొపేన్, లిక్విఫైడ్ బ్యూటేన్‌ల దిగుమతులపై వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్ (ఎఐడిసి) నుండి సెప్టెంబర్ 1 నుండి పూర్తిగా మినహాయించబడినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది.
