ఆగస్టు 1, 2025 నుంచి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ వినియోగదారుల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలను అమలు చేయనుంది.

ఆగస్టు 1, 2025 నుంచి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ వినియోగదారుల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలను అమలు చేయనుంది. ఈ నిబంధనలు UPI వ్యవస్థను మరింత సురక్షితం, వేగవంతం, నమ్మదగినదిగా చేయడానికి రూపొందించబడ్డాయి. ఈ మార్పులు Google Pay, PhonePe, Paytm వంటి UPI యాప్‌లను ఉపయోగించే వినియోగదారులందరిపై ప్రభావం చూపుతాయి. ఒక UPI యాప్‌లో రోజుకు 50 సార్లు మాత్రమే బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయవచ్చు. రెండు యాప్‌లు ఉపయోగిస్తే, ప్రతి యాప్‌లో 50 సార్లు చెక్ చేయవచ్చు. ఈ పరిమితి అనవసరమైన API కాల్స్‌ను తగ్గించి, సిస్టమ్ వేగాన్ని పెంచడానికి ఉద్దేశం కోసం తెలిపారు.మీ మొబైల్ నంబర్‌తో లింక్ అయిన బ్యాంక్ ఖాతాలను రోజుకు 25 సార్లు మాత్రమే చూడగలరు. ఇది సిస్టమ్‌పై ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఒక ట్రాన్సాక్షన్ స్టేటస్‌ను రోజుకు 3 సార్లు మాత్రమే చెక్ చేయవచ్చు, ప్రతి చెక్ మధ్య 90 సెకన్ల గ్యాప్ తప్పనిసరి.ఇది వినియోగదారులు రిపీటెడ్‌గా రిఫ్రెష్ చేయడం వల్ల సిస్టమ్ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ మార్పులు సిస్టమ్ ఒత్తిడిని తగ్గించి, ట్రాన్సాక్షన్ వేగాన్ని మరియు సురక్షితతను పెంచుతాయి, ముఖ్యంగా ఏప్రిల్, మే 2025లో జరిగిన సర్వర్ డౌన్‌టైమ్‌ల తర్వాత. సాధారణ వినియోగదారులు, అరుదుగా బ్యాలెన్స్ లేదా స్టేటస్ చెక్ చేసేవారు ఈ మార్పులను గుర్తించకపోవచ్చు.
