నెల్లై జిల్లాలోని పత్తమడైకి చెందిన 40 ఏళ్ల మురుగన్‌తో సంబంధం ఉన్న ఒక 10వ తరగతి విద్యార్థిని పోలీస్ స్టేషన్ మిద్దె పైనుంచి దూకి గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటన చోటు చేసుకుంది.

నెల్లై జిల్లాలోని పత్తమడైకి చెందిన 40 ఏళ్ల మురుగన్‌తో సంబంధం ఉన్న ఒక 10వ తరగతి విద్యార్థిని పోలీస్ స్టేషన్ మిద్దె పైనుంచి దూకి గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటన చోటు చేసుకుంది. నెల్లై జిల్లా, పత్తమడైకి చెందిన 40 ఏళ్ల మురుగన్, కేరళలో కూలీగా పనిచేస్తున్నాడు. అతనితో సంబంధం ఉన్న ఒక 10వ తరగతి విద్యార్థిని, అతనితో వెళ్లేందుకు ప్రయత్నించి, పోలీసులకు పట్టుబడినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత, ఆమె పోలీస్ స్టేషన్ మిద్దె పైనుంచి దూకడంతో తీవ్ర గాయాలై, ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. ఆమె తన ప్రియుడిని విడిచిపెట్టనని స్పష్టంగా చెప్పింది. అయితే విద్యార్థిని మైనర్‌ కావడంతో పోలీసులకు అప్పగిస్తామని తేల్చారు. దీంతో నిరాశ చెందిన ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి పోలీస్‌ స్టేషన్‌ మిద్దెపై నుంచి దూకింది. ఈ క్రమంలో ఆమె రెండు కాళ్లు విరిగిపోయి ప్రాణపాయ స్థితిలో ఉంది. వెంటనే పోలీసులు అతన్ని రక్షించి చికిత్స కోసం నెల్లై ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఆమెకి తీవ్ర చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన తర్వాత, పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి మురుగన్‌ను అరెస్టు చేశారు. మురుగన్‌కు వివాహం జరిగి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారని చెప్పడం గమనార్హం.

ehatv

ehatv

Next Story