కూతురు వయసున్న యువతిని లోబరుచుకుని పెళ్లి చేసుకున్న వ్యక్తి.. చివరకు ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

కూతురు వయసున్న యువతిని లోబరుచుకుని పెళ్లి చేసుకున్న వ్యక్తి.. చివరకు ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కొన ఊపిరితో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. నాన్న నన్ను బ్రతికించు, నాకు చచ్చిపోవాలని లేదంటూ యువతి ప్రాణాలు విడిచింది. వరంగల్ ఎనుమాముల ఇందిరమ్మ కాలనీకి చెందిన గాయత్రి(22) ఇంటర్ మధ్యలోనే ఆపేసి ఇంట్లో ఉంటుంది. వీరి ఇంటి ఎదురుగా ఉండే డీసీఎం డ్రైవర్ వేల్పుగొండ స్వామి(42)కి పెళ్లై, ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయినా గాయత్రికి మాయమాటలు చెప్పి లోబరుచుకుని ప్రేమాయణం సాగించాడు.
ఈ విషయం తెలిసి 6 నెలల కింద గాయత్రి తల్లిదండ్రులు పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టగా.. పెద్దలు మందలించడంతో స్వామి మకాం హన్మకొండకు మార్చాడు. కానీ గాయత్రితో సీక్రెట్‌గా సంబంధం నడిపాడు.. గాయత్రికి పెళ్లి చేద్దామని భావించగా, ఈనెల 2న 10 తులాల బంగారం, నగదు తీసుకుని తను వెళ్లిపోయింది. ఇంట్లోంచి వెళ్లిపోయిన గాయత్రి, స్వామితో విజయవాడ, గుంటూరులో గడిపింది.. ఆ తర్వాత వేములవాడలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అన్నారం షరీప్‌కు ఇద్దరు వచ్చి ఒక అద్దె గది తీసుకున్నారు.. ఈ బంధం నిలబడదని స్వామి ఆత్మహత్యకు ప్రేరేపించగా, ఇద్దరూ గడ్డి మందు తాగారు. స్వామి అక్కడిక్కడే మృతి చెందగా, కొన ఊపిరితో ఉన్న గాయత్రిని రూమ్ ఓనర్ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించాడు. గాయత్రి తల్లిదండ్రులకు రూమ్ ఓనర్ సమాచారం ఇవ్వగా.. ఆసుపత్రికి వెళ్లిన తండ్రితో, నాన్న నన్ను బ్రతికించు, నాకు చచ్చిపోవాలని లేదంటూ గాయత్రి ప్రాణాలు విడిచింది.
