ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువ సమయం సెల్‌ఫోన్‌లోనే గడుపుతున్నారు. పిల్లలు మారాం చేయగానే తల్లిదండ్రులు గారాబాంతో సెల్‌ఫోన్‌ను పిల్లలకు అందిస్తున్నారు.

ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువ సమయం సెల్‌ఫోన్‌లోనే గడుపుతున్నారు. పిల్లలు మారాం చేయగానే తల్లిదండ్రులు గారాబాంతో సెల్‌ఫోన్‌ను పిల్లలకు అందిస్తున్నారు. వారు ఇష్టానుసారంగా దానిని వాడుతూ సెల్‌ఫోన్‌కు అడిక్ట్‌ అవుతున్నారు. ఒకవేళ తల్లిదండ్రులు పిల్లలను మందలిస్తే వారు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌(Hyderabad)లో చోటు చేసుకుంది. హైదరాబాద్ బాలాపూర్ (Balapur)పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రకుంట మహమ్మద్ నగర్ ప్రాంతానికి చెందిన షేక్ నిసార్ అహ్మద్ అనే వ్యక్తి ఆటో డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఒక ప్రైవేటు స్కూల్లో 6వ తరగతి చదువుతున్న అతని కొడుకు షేక్ అయాన్ (Sheik Ayan)(14) తనకు సెల్ ఫోన్ కావాలని తండ్రిని కోరగా, ఈ వయసులో సెల్ ఫోన్ ఎందుకని అయాన్‌ను మందలించిన తండ్రి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యి, ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న అయాన్

Updated On
ehatv

ehatv

Next Story