ముంబయికి చెందిన 80 ఏళ్ల వృద్ధుడికి 2023లో మహిళ పేరుతో సైబర్ నేరగాళ్లు వలపు వల వేశారు

ముంబయికి చెందిన 80 ఏళ్ల వృద్ధుడికి 2023లో మహిళ పేరుతో సైబర్ నేరగాళ్లు వలపు వల వేశారు, వారి వలలో చిక్కి 734 సార్లు దాదాపు 8.7 కోట్లు పంపిన వృద్ధుడు. ఫేస్ బుక్ లో మొదట షార్వీ అనే పేరుతో పరిచయం ఏర్పరుచుకొని.. భర్త నుంచి విడిపోయి, పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటున్నానని వృద్ధుడికి మాయమాటలు చెప్పింది. వృద్ధుడితో నిత్యం ఫోన్ లో మాట్లాడుతూ పలుమార్లు డబ్బులు కాజేసిన షార్వీ.. ఆ తర్వాత తన స్నేహితురాలిని అంటూ కవిత అనే పేరుతో మరో ట్రాప్‌కు పాల్పడింది. తర్వాత షార్వీ చనిపోయిందని, తాను ఆమె సోదరి దినాజ్‌ను అంటూ ఆసుపత్రిలో బిల్లులు కట్టాలంటూ తప్పుడు ఆధారాలు చూపించి మళ్ళీ డబ్బులు కోరింది. ఆ తర్వాత దినాజ్ స్నేహితురాలిని జాస్మిన్‌ను అంటూ ఇలా నలుగురు అమ్మాయిల పేరుతో డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లు. డబ్బులు లేకున్నా వేరే వారి నుంచి అప్పు చేసి మరీ పంపిన వృద్ధుడు.
కుటుంబసభ్యులు డబ్బుల విషయం గురించి పలుమార్లు ప్రశ్నించి, చెప్పడం లేదని ఆరా తీయగా ఈ స్కాం బయటపడింది. ఇదంతా సైబర్ మోసం అని తెలిసి ఆసుపత్రి పాలైన వృద్ధుడు.. ఆయనకు డిమెన్షియా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. సైబర్ మోసంపై ఫిర్యాదు చేసిన కుటుంబసభ్యులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
