ప్రియుడు అనుమానించాడని.. వాటర్ ట్యాంక్‌పై నుంచి దూకి యువతి ఆత్మహత్య..!

ప్రియుడు అనుమానించాడని.. వాటర్ ట్యాంక్‌పై నుంచి దూకి యువతి ఆత్మహత్య చేసుకుంది. నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది. . ఖమ్మం సమీపంలోని కొత్తగూడెం పట్టణానికి చెందిన ఐశ్వర్య(19) తన అన్న అరవింద్ నాగోలు సమీపంలోని తట్టిఅన్నారం వైఎస్ఆర్ కాలనీలో అద్దెకు ఉంటున్నారు. అయితే వీరికి దూరపు బంధువైన మహేష్ అలియాస్ ఆనంద్ (23) నగరంలోని హస్తినాపురంలో ఉంటూ ఆటో నడుపుతుండగా.. ఏడాది క్రితం జరిగిన అయ్యప్ప పూజలో ఐశ్వర్యను చూసిన బంధుత్వంతో తరచూ ఆనంద్ వారి ఇంటికి వచ్చేవారు. ఇటీవల ఆమెను ప్రేమిస్తున్నానంటూ.. పెళ్లిచేసుకుంటానంటూ వెంటపడటంతో యువతి అంగీకరించింది. మొదట పెద్దలు నిరాకరించినా.. వారూ అంగీకరించగా.. యువతి మరెవరితోనో ఫోన్లో తరచూ మాట్లాడుతోందని ఆనంద్ అనుమానం పెంచుకున్నాడు. ఈ నెల 5న ఇరువురూ తరచూ కలుసుకునే హౌసింగ్ బోర్డు కాలనీలోని ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్ వద్దకు చేరుకోగా.. ఫోన్ల విషయమై ఆనంద్ నిలదీయడంతో తీవ్ర మనస్తాపానికి గురై వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కి యువతి దూకేసింది. నాగోలులోని ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందింది. యువతి ఆత్మహత్యకు కారణమైన మహేష్ అలియాస్ ఆనంద్ పై ఐశ్వర్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు


