పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో సోమవారం ఓ హత్య జరిగింది.

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో సోమవారం ఓ హత్య జరిగింది. పొలం కుమార్(Polam Kumar)ను హతమార్చిన కేసులో నిందితులు వేల్పుల సంతోష్(Velpula Santosh), వేల్పుల శైలజను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఏసీపీ గజ్జి కృష్ణ వెల్లడించారు. గత కొన్ని రోజులుగా కుమార్‌తో శైలజ సన్నిహితంగా ఉండడాన్ని చూసి వివాహేతర సంబంధం ఉందని సంతోష్ అనుమానించాడు. పద్ధతి మార్చుకోవాలని శైలజ(Velpula Shailaja)ను మందలించాడు. కానీ భర్త వ్యాఖ్యలతో శైలజ విబేధించింది. తనకు కుమార్‌తో ఎలాంటి సంబంధం లేదని అతనే తన వెంటపడుతూ ఇబ్బంది పెడుతున్నాడని ఆమె చెప్పింది. దీంతో కుమార్‌పై సంతోష్ కోపం పెంచుకున్నాడు. కానీ బంధువుల వద్ద శైలజతో సంబంధం ఉందని కుమార్ చెప్పుకున్నాడు. శైలజకు కూడా ఫోన్లు చేస్తుండడంతో కుమార్‌ను చంపాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈక్రమంలో సోమవారం మాట్లాడుకుందాం రమ్మని కుమార్‌కు ఫోన్‌చేసి చెప్పడంతో వ్యవసాయమార్కెట్‌కు కారులో చేరుకున్నాడు. ఈలోగా పెద్దపల్లి(Peddapalli)కి వచ్చిన సంతోష్.. జెండా వద్ద ఓ కత్తిని కొనుగోలు చేసి భార్య శైలజకు కుమార్‌ను చంపుతున్న విషయాన్ని వివరించాడు. శైలజ దొంగతుర్తి నుంచి బస్సులో పెద్దపల్లికి వచ్చింది. ఆమెను బైక్‌పై తీసుకుని మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు కుమార్, సంతోష్ వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలోనే తన వద్ద ఉన్న కత్తి తీసి మెడ, చాతి, ముఖంపై పొడిచి చంపారు. కుమార్ చనిపోయాడని నిర్ధారించుకుని నిందితులు పరారయ్యారు. ఈమేరకు నిందితులైన భార్యాభర్తలు సంతోష్, శైలజు దొంగతుర్తిలో ఉన్నారనే సమాచారంతో అక్కడకు వెళ్లి పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు.
