sexual desires: లైంగిక కోరిక తీర్చలేదని 34 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను చంపి అగ్నిప్రమాదంగా చిత్రీకరించిన 18 ఏళ్ల బాలుడు..!

జనవరి 3న రామమూర్తి నగర్‌లోని తన ఫ్లాట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన 34 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కేసులో భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒంటరిగా ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రూమ్‌లోకి చొరబడిని ఇంటర్ బాలుడు ఆమెను బలవంతం చేయబోయాడు. ఆమె ప్రతిఘటించినప్పుడు, అతను ఆమెను గొంతు కోసి, ఆపై అగ్ని ప్రమాదంగా చిత్రీకరించడానికి ఫ్లాట్‌కు నిప్పంటించాడు. నిందితుడిని కొడగు జిల్లాలోని విరాజ్‌పేట పట్టణానికి చెందిన కర్నాల్ కురై (18) గా గుర్తించారు. అతను మృతురాలి ఇంటి పక్కనే తన తల్లితో కలిసి ఉంటున్నాడు.
దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన బాధితురాలు షర్మిల డి.కె., సుబ్రహ్మణ్య లేఅవుట్‌లోని సంకల్ప నిలయ వద్ద డబుల్ బెడ్‌రూమ్‌ల అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోంది. జనవరి 3న రాత్రి 10.15 నుంచి 10.45 గంటల మధ్య షర్మిల అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను ఆర్పి, ఇంట్లో కాలిపోయిన షర్మిల మృతదేహాన్ని కనుగొన్నారు. అయితే, షర్మిల స్నేహితుల్లో ఒకరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. దీని ఆధారంగా, రామమూర్తి నగర్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు. క్రైమ్ అధికారులు, ఫోరెన్సిక్ నిపుణుల దర్యాప్తులో షార్ట్-సర్క్యూట్ సిద్ధాంతానికి మద్దతు ఇచ్చే ఆధారాలు ఏవీ లభించలేదు. మహిళ ఊపిరాడక మరణించిందని శవపరీక్షలో వెల్లడైంది. రాత్రి 9 గంటల ప్రాంతంలో షర్మిల అపార్ట్‌మెంట్‌లోకి ఒక కిటికీ తెరిచి ప్రవేశించాడని తేలింది. ఆ తర్వాత అతను ఆమె దగ్గరికి వెళ్లి "లైంగికంగా సహకరించాలని" డిమాండ్ చేశాడు. షర్మిల ప్రతిఘటించినప్పుడు, నిందితుడు ఆమె నోరు, ముక్కును గట్టిగా పట్టుకున్నాడని, దీని వల్ల ఆమె స్పృహ కోల్పోయిందని ఆరోపించారు. ఈ క్రమంలో ఆమెకు రక్తస్రావం, గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అతను షర్మిల మొబైల్ ఫోన్‌ను తీసుకొని అక్కడి నుండి పారిపోయాడు. జనవరి 10న నిందితుడిని అతని ఇంటి నుండి అరెస్టు చేశారు. అతన్ని కోర్టు ముందు హాజరుపరిచి మూడు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు.


