HR manager harassed a female employee: కోరిక తీర్చాలని మహిళా ఉద్యోగికి HR మేనేజర్ వేధింపులు.. ఆమె ఏంచేసిందంటే..!

నా కోరిక తీర్చాలి.. నాతో పబ్‌కు రావాలి.. నాతో కలిసి షికార్లు చేయాలి.. లేదంటే నీ సంగతి చూస్తా అంటూ మహిళా ఉద్యోగిని వేధిస్తున్న హెచ్‌ఆర్‌పై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఓ ప్రముఖ కంపెనీలో హెచ్‌ఆర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న స్వామిరెడ్డి అదే కంపెనీలో పనిచేసే మహిళా ఉద్యోగిని తనతో కలిసి పబ్‌కు రావాలని వేధిస్తున్నాడు. కార్యాలయం విధుల్లో భాగంగా ట్రిప్‌కు వెళ్లిన సందర్భంలో ఈ వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. తన కోరిక తీర్చాలని బలవంతం చేసేవాడు. దీనికి యువతి నిరాకరించడంతో ఆమెను డిమోట్‌ చేశాడు. తోటి ఉద్యోగుల వద్ద బాధితురాలి గురించి అసభ్యంగా మాట్లాడుతుండేవాడు. దీంతో అతని వేధింపులు తాళలేక బాధితురాలు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story