Charles Engola : జీతం ఇవ్వడం లేదని మంత్రిని కాల్చిచంపిన బాడీగార్డ్!
బాడీగార్డ్‌లతో జాగ్రత్త సుమండి! వారికి జీతభత్యాలు సమయానికి ఇచ్చి, వారి తిండితిప్పలను గమనించుకుంటే ఫర్వాలేదు.. లేకపోతే మాత్రం కష్టమే! ఇట్టాడే ఉగాండాలో ఓ బాడీగార్డు మంత్రిని కాల్చి చంపేశాడు. ఎందుకూ అంటే బాడీగార్డుకు మంత్రి జీతం సరిగ్గా ఇవ్వడం లేదట! ఉగాండా(Uganda) రాజధాని కంపాలా(Kampala)లో ఆ దేశ కార్మిక శాఖ సహాయమంత్రి, రిటైర్డ్ కల్నల్ చార్లెస్ ఎంగోలా (Charles Engola) నివాసంలోనే ఈ ఘటన జరిగింది.

Charles Engola
బాడీగార్డ్‌లతో జాగ్రత్త సుమండి! వారికి జీతభత్యాలు సమయానికి ఇచ్చి, వారి తిండితిప్పలను గమనించుకుంటే ఫర్వాలేదు.. లేకపోతే మాత్రం కష్టమే! ఇట్టాడే ఉగాండాలో ఓ బాడీగార్డు మంత్రిని కాల్చి చంపేశాడు. ఎందుకూ అంటే బాడీగార్డుకు మంత్రి జీతం సరిగ్గా ఇవ్వడం లేదట! ఉగాండా(Uganda) రాజధాని కంపాలా(Kampala)లో ఆ దేశ కార్మిక శాఖ సహాయమంత్రి, రిటైర్డ్ కల్నల్ చార్లెస్ ఎంగోలా (Charles Engola) నివాసంలోనే ఈ ఘటన జరిగింది. బాడీగార్డు (Body Guard)తన దగ్గర ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. ఆ కాల్పల్లో మంత్రి అక్కడికక్కడే కన్నుమూశాడు. పట్టుకుంటే ప్రాణాలు పోతాయని తెలిసి పాపం ఆ బాడీగార్డు కూడా తనను తాను కాల్చుకుని చనిపోయాడు. మంత్రి దగ్గర అంగరక్షకుడిగా పని చేస్తున్న ఈ వ్యక్తిగా చాన్నాళ్లుగా జీతాలు ఇవ్వడం లేదని సమాచారం. ఆ కోపంతోనే మంత్రిని కాల్చి చంపినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇది దురదృష్టకరమైన సంఘటన అని, దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడతామని ఆర్మీ ప్రతినిధి ఫెలిక్స్ కులాయిగ్వే(Felix Kulayigye) అన్నారు. ఎంగోల హత్యకు వేతనాలే కారణమా? లేక మరేమైనా ఉందా అన్నది దర్యాప్తులో తేలుతుందని ఆయన చెప్పారు.
