రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఉదయపూర్ ఓ మహిళపై సామూహిక అత్యాచార ఉదంతం కలకలం రేపింది.

రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఉదయపూర్ ఓ మహిళపై సామూహిక అత్యాచార ఉదంతం కలకలం రేపింది. ఈ దురాగతానికి సంబంధించి అత్యంత దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కంపెనీ సీఈవో పుట్టినరోజు, లేట్-నైట్ పార్టీలో మహిళా ఉద్యోగిపై లైంగిక దాడి చేశారు. బాధితురాలిని ఇంట్లో వదిలిపెడతామని నమ్మించి, దారిలో మత్తు పదార్థం ఇచ్చి అపస్మారక స్థితిలోకి తీసుకెళ్లి ఘాతుకానికి పాల్పడ్డారు. డాష్‌క్యామ్ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో సీఈవో భార్య కూడా ఉండడం గమనార్హం.
పుట్టిన రోజు పార్టీ తర్వాత ఇంటి దగ్గర దింపుతామని చెప్పి కంపెనీ సీఈవో మరో ఇద్దరితో కలిసి కదులుతున్న కారులో మహిళా ఉద్యోగినిపై సామూహిక అత్యాచారం చేశాడు. ఈ కేసులో కంపెనీ సీఈవో జయేష్, మరో ఎగ్జిక్యూటివ్ గౌరవ్, అతని భార్య శిల్ప సహా ముగ్గురిని ఉదయ్ పూర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను గురువారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకుని, తరువాత స్థానిక కోర్టు రిమాండ్‌కు తరలించారు. కంపెనీ సీఈవో పుట్టిన రోజు సందర్భంగా శోభాగ్‌పురాలోని ఒక హోటల్‌లో రాత్రి 9 గంటల ప్రాంతంలో పార్టీ ప్రారంభమై దాదాపు అర్ధరాత్రి 1.30 గంటల వరకు కొనసాగింది. సమయం ఎక్కువ కావడంతో ఆఫర్ చేశారు. దారి మధ్యలో సిగరెట్‌ను పోలిన మత్తు పదార్థాన్ని ఇచ్చారని బాధితురాలు ఆరోపించింది. అది తిన్న తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన బాధితురాలిపై కారులోనే అత్యాచారానికి పాల్పడ్డారు.. మెలకువ వచ్చిన తరువాత చెవిపోగులు, ముఖ్యంగా లోదుస్తులు మాయం కావడం ప్రైవేట్ పార్ట్స్‌పై గాయాలు ఆమెలో భయాన్ని రేపాయి. దీంతో కారు డాష్‌క్యామ్ ఫుటేజీలో పరిశీలించాక జరిగిన దారుణమంతా రికార్డ్ అయిందని గుర్తించింది.


