మాజీమంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ(dk aRUNA) కుమార్తె శృతి రెడ్డి(Shruti Reddy) ఇంట్లో క్రెడిట్ కార్డు చోరీకి గురైంది. కార్డు దొంగిలించింది ఆమె కారు డ్రైవర్‌గా తెలుస్తోంది. కార్డ్ నుంచి రూ.11 లక్షలు డ్రా చేసినట్లు గుర్తించారు. శ్రుతి బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 14లోని ప్రేమ్ పర్వత్ విల్లాస్‌లో ఉంటున్నారు. ఆమె వద్ద గత డిసెంబర్ నుంచి బీసన్న అనే వ్యక్తి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

Credit Card Theft
మాజీమంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ(DK Aruna) కుమార్తె శృతి రెడ్డి(Shruti Reddy) ఇంట్లో క్రెడిట్ కార్డు చోరీకి గురైంది. కార్డు దొంగిలించింది ఆమె కారు డ్రైవర్‌గా తెలుస్తోంది. కార్డ్ నుంచి రూ.11 లక్షలు డ్రా చేసినట్లు గుర్తించారు. శ్రుతి బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 14లోని ప్రేమ్ పర్వత్ విల్లాస్‌లో ఉంటున్నారు. ఆమె వద్ద గత డిసెంబర్ నుంచి బీసన్న అనే వ్యక్తి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శృతిరెడ్డి ఫిర్యాదు మేరకు బీసన్నపై ఐపీసీ 420, 408 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బంజారా హిల్స్ పోలీసులు.


