✕
Ireland Incident : అట్టుడికిన ఐర్లాండ్ రాజధాని.. పలు వాహనాలకు నిప్పు
By EhatvPublished on 23 Nov 2023 11:22 PM GMT
ఐర్లాండ్(Ireland) రాజధాని డబ్లిన్‌లో (Dublin)లో అల్లర్లు(Riots) చెలరేగాయి. నగరంలోని ఓ స్కూల్(School) బయట దుండగుడు కత్తితో దాడి చేయడంతో ముగ్గురు విద్యార్థులతో(Student) పాటు అయిదుగురు గాయపడ్డారు.

x
Ireland Incident
ఐర్లాండ్(Ireland) రాజధాని డబ్లిన్‌లో (Dublin)లో అల్లర్లు(Riots) చెలరేగాయి. నగరంలోని ఓ స్కూల్(School) బయట దుండగుడు కత్తితో దాడి చేయడంతో ముగ్గురు విద్యార్థులతో(Student) పాటు అయిదుగురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ప్రజలు రోడ్డు మీదకు వచ్చారు. డబ్లిన్ వీధులలో నిరసనలు, ఆందోళనలు (Protests) చేపట్టారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. దుకాణాలను లూటీ చేశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థుతులు అదుపులోకి వచ్చాయని అధికారులు అంటున్నారు.

Ehatv
Next Story