ఒక్కగానొక్క కూతురు(34) అనారోగ్యంతో చనిపోతే.. ఆ తర్వాత అడుగడుగునా లంచం ఇవ్వలేక ఆ తండ్రి కుంగిపోయారు.

ఒక్కగానొక్క కూతురు(34) అనారోగ్యంతో చనిపోతే.. ఆ తర్వాత అడుగడుగునా లంచం ఇవ్వలేక ఆ తండ్రి కుంగిపోయారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. BPCL మాజీ CFO శివకుమార్ కూతురు ఇటీవల మరణించారు. అయితే అంబులెన్స్ మొదలుకుని FIR, పోస్టుమార్టం రిపోర్టు, అంత్యక్రియలు, డెత్ సర్టిఫికెట్ వరకు లంచం ఇవ్వాల్సి వచ్చిందని అతను సోషల్ మీడియాలో పోస్టు చేసి ఆ తర్వాత డిలీట్ చేశారు. సిస్టమ్‌లోని కరప్షన్‌పై నెటిజన్లు ఫైరవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే శివకుమార్ 64 ఏళ్లు ఏకైక కూతురు అక్షయా సివకుమార్ (34) ఇంట్లోనే బ్రెయిన్ హెమరేజ్తో మరణించింది. దీంతో పోస్టుమార్టం, మృతదేహం తరలింపు, డెత్ సర్టిఫికెట్ కోసం లంచం డిమాండ్ చేశారు లంచగొండులు. ఓ వైపు కూతురును పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో తండ్రి ఉంటే లంచాలు డిమాండ్ చేసి ఆయనను మరింత కుంగదీసేలా ప్రవర్తించారు. “ఇటీవల నా ఏకైక బిడ్డ 34 సంవత్సరాల వయసులో మరణించాడు. అంబులెన్స్, పోలీసులు FIR, పోస్ట్‌మార్టం నివేదిక కోసం, రసీదు ఇవ్వడానికి శ్మశానవాటిక, మరణ ధృవీకరణ పత్రం కోసం BBMP కార్యాలయం అడిగిన బహిరంగ లంచాల మొత్తం,” అని ఆయన తన పోస్ట్‌లో రాశారు. అంబులెన్స్ డ్రైవర్ కుమార్తె శరీరాన్ని ఒక ఆసుపత్రి నుంచి మరొక ఆసుపత్రికి తరలించేందుకు రూ. 3,000 అడిగినట్లు చెప్పారు. పోలీసులు FIR, పోస్టుమార్టమ్ రిపోర్ట్ అందించడానికి ఓ పోలీస్ స్టేషన్‌లో నగదు లంచం అడిగారు అని పేర్కొన్నారు. BBMP కార్యాలయంలో మరణ ధృవపత్రం పంపించడంలో కూడా సాధారణ ఫీజును మించి చెల్లించాలని అడిగినట్లు ఆయన తెలిపాడు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వైరల్ అయింది. ఈ పోస్టును తరువాత తొలగించారు. విషయాన్ని చూసి బెంగళూరు ఉన్నతాధికారులు ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు.


