✕
కొన్నిసార్లు మంచికి పోతే చెడు ఎదురవుతుంది. మన వాళ్లే కదా కష్టాల్లో ఉన్నారు, తోచిన సాయం చేద్దాం అని అనుకుంటే అది మన జీవితాన్నే దుర్భరం చేసేస్తుంది

x
కొన్నిసార్లు మంచికి పోతే చెడు ఎదురవుతుంది. మన వాళ్లే కదా కష్టాల్లో ఉన్నారు, తోచిన సాయం చేద్దాం అని అనుకుంటే అది మన జీవితాన్నే దుర్భరం చేసేస్తుంది. విజయనగరం జిల్లాలోని కెరటం గ్రామంలో జరిగిన ఈ దారుణమైన సంఘటన జరిగింది. ఈ కేసు స్థానికంగా సంచలనంగా మారింది. విజయనగరం జిల్లా, బొండపల్లి మండలం, కెరటం గ్రామంలో కృష్ణ (మేనమామ) భార్యతో సాయి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ సంగతి తెలియడంతో మేనమామ తన అల్లుడు సాయిని మందలించాడు. ఓ దశలో గొడవ కూడా పడ్డారు. ఈ వివాదం హత్యకు దారితీసింది, సాయి కృష్ణను చంపి, శవాన్ని ఎవరికీ తెలియకుండా గ్రామంలోని ఓ చెరువు సమీపంలో పూడ్చిపెట్టాడు. శవం సమీపంలోని చెరువు వద్ద దొరికినట్లు పోలీసులు తెలిపారు.

ehatv
Next Story