Extramarital affairs..! వివాహేతర సంబంధాలు..!. తాజాగా భర్త నోట్లో టవల్ కుక్కి ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య..!

తన ప్రియుడితో బాగా ఎంజాయ్‌ చేయాలని తపించింది. ఇందుకు అడ్డుగా ఉన్న భర్తను హతమార్చాలని ప్లాన్ గీసింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతో ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసింది. నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం సీత్యాతండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీత్యాతండా గ్రామానికి చెందిన రమావత్‌ రవి(34)కి మిర్యాలగూడ మండలం ఏడుకోట్ల తండాకు చెందిన లక్ష్మితో 11 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రవి తల్లిదండ్రులు కూడా అతడితో పాటే ఇంటి ముందు గుడిసెలో నివాసముంటున్నారు.

మిర్యాలగూడ మండలం దొండవారిగూడెం గ్రామానికి చెందిన రవి సొంత సోదరి కుమారుడై మాలోతు గణేశ్‌తో లక్ష్మి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయమై రవి పలుసార్లు లక్ష్మిని మందలించాడు. ఈ వ్యవహారాన్ని మానుకోవాలని కోరారు. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రాగా లక్ష్మి సంవత్సరం క్రితం తన తల్లిగారింటికి వెళ్లింది. రవి తల్లిదండ్రులు పెద్దమనుషులతో మాట్లాడించి లక్ష్మిని తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. అయితే లక్ష్మి ఎలాగైనా తన భర్తను అడ్డు తొలగించుకోవాలని పథకం రచించింది. మంగళవారం ఉదయం రవి చిన్న కుమారుడిని హాస్టల్‌లో విడిచిపెట్టేందుకు అతడి తండ్రి సూర్యాపేటకు వెళ్లాడు.

మధ్యాహ్నం రవి మద్యం సేవించి ఇంట్లో నిద్రిస్తుండగా.. లక్ష్మి తన ప్రియుడు గణేశ్‌ను ఇంటికి పిలిచింది. అనంతరం రవి నోట్లో గుడ్డలు పెట్టి కర్రతో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం లక్ష్మి, గణేశ్‌ అక్కడి నుంచి పారిపోయారు. బుధవారం ఉదయం ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు వెళ్లి చూడగా రవి రక్తము మడుగులో పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

Updated On 29 Jan 2026 6:17 AM GMT
ehatv

ehatv

Next Story