ఎన్టీఆర్ జిల్లాలో పిల్లలను చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖ రాసి అందరిని నమ్మించిన తండ్రి రవిశంకర్ కేసులో ట్విస్ట్ .

ఎన్టీఆర్ జిల్లాలో పిల్లలను చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖ రాసి అందరిని నమ్మించిన తండ్రి రవిశంకర్ కేసులో ట్విస్ట్ .రవిశంకర్ బ్రతికే ఉన్నాడనే అనుమానంతో దర్యాప్తు చేసి విశాఖ పోలీసులు

ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో జూన్ 12, 2025న జరిగిన హృదయవిదారక ఘటనలో, వేములవాడ రవిశంకర్ అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలు హిరణ్య (9), లీలసాయి (7)ను పురుగుల మందు తాగించి హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖ రాసి పరారయ్యాడు. భార్య చంద్రికపై అనుమానంతో ఈ దారుణం చేసినట్లు అతను విచారణలో అంగీకరించాడు. పోలీసులు రవిశంకర్ మృతదేహం కోసం గాలించగా, అతను బతికే ఉన్నాడనే అనుమానంతో బ్యాంకు లావాదేవీలు, కొత్త సిమ్ కార్డు వివరాల ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేసి, విశాఖపట్నంలోని సింహాచలంలో అతన్ని అరెస్టు చేశారు. ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది.

Updated On
ehatv

ehatv

Next Story