ఇద్దరు చిన్నారుల పట్ల తండ్రే కాలయముడయ్యాడు. గుడికి తీసుకెళ్తానని చెప్పి వెంటపెట్టుకుని వెళ్లి ఇద్దరినీ కాలువలో తోసేశాడు.

ఇద్దరు చిన్నారుల పట్ల తండ్రే కాలయముడయ్యాడు. గుడికి తీసుకెళ్తానని చెప్పి వెంటపెట్టుకుని వెళ్లి ఇద్దరినీ కాలువలో తోసేశాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం(Anantapur) జిల్లా బొమ్మనహాళ్‌ మండలం నేమకల్లుకు చెందిన శిల్ప(Shilpa), కల్లప్ప(Kallappa)కు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. కల్లప్ప కూలి పనులు చేస్తుంటాడు. కూతుర్లు సింధు(Sindhu) (11), అనూష(Anusha) (9) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6, 5 తరగతులు చదువుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో ఇంటివద్దే ఉన్న కూతుర్లను కల్లప్ప గుడికి అని చెప్పి తీసుకెళ్లాడు. కర్ణాటక(Karnataka)లోని సిరిగేరి క్రాస్‌ వద్ద తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) వద్దకు వెళ్లాక పెద్ద కూతురు సింధును నీటిలోకి తోసేశాడు. చిన్న కూతురు అనూష గమనించి భయంతో పరుగులు తీసినా ఊరుకోలేదు. వెంటాడి, వెంబడించిన కల్లప్ప అనూషను పట్టుకొని కాలువలోకి విసిరేశాడు. అమాయకుడిలా సోమవారం గ్రామానికి చేరుకున్నాడు. పిల్లలు ఎక్కడ ఉన్నారని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా నోరు మెదపలేదు. ఒకరోజు గడిచినా పిల్లలు రాలేదు. దీంతో బంధువులు, గ్రామస్తులు గట్టిగా నిలదీయగా సిరిగేరి కాలువలో తోశానని చెప్పాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా చిన్నారుల కోసం బంధువులు, పోలీసులు గాలించగా సింధు మృతదేహాన్ని గుర్తించారు. మరో చిన్నారి అనూషకోసం గాలిస్తున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story