అమెరికా(America)లో గ‌న్ క‌ల్చ‌ర్(Gun Culture) వ‌ల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కెంటుకీ(Kentucky)లోని డౌన్‌టౌన్ లూయిస్‌విల్లే(Downtown Louisville )లోని ఓ కార్యాలయంలో జ‌రిగిన కాల్పుల ఘ‌ట‌న‌లో ఐదుగురు బ్యాంకు ఉద్యోగులు(Bank Employees) మరణించారు. ఈ ఘ‌ట‌న‌లో మరో తొమ్మిది మంది గాయపడ్డారు. మరణించిన వారిలో కెంటకీ గవర్నర్‌కు సన్నిహితుడైన టామీ ఇలియట్(Tommy Elliot)కూడా ఉన్నారు. వాటర్‌ఫ్రంట్ పార్క్‌(Waterfront Park)కు దూరంగా ఉన్న భవనంలో జరిగిన కాల్పుల్లో.. తన సన్నిహిత స్నేహితుల్లో ఒకరిని కోల్పోయినట్లు కెంటుకీ గవర్నర్ ధృవీకరించారు.

అమెరికా(America)లో గ‌న్ క‌ల్చ‌ర్(Gun Culture) వ‌ల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కెంటుకీ(Kentucky)లోని డౌన్‌టౌన్ లూయిస్‌విల్లే(Downtown Louisville )లోని ఓ కార్యాలయంలో జ‌రిగిన కాల్పుల ఘ‌ట‌న‌లో ఐదుగురు బ్యాంకు ఉద్యోగులు(Bank Employees) మరణించారు. ఈ ఘ‌ట‌న‌లో మరో తొమ్మిది మంది గాయపడ్డారు. మరణించిన వారిలో కెంటకీ గవర్నర్‌కు సన్నిహితుడైన టామీ ఇలియట్(Tommy Elliot)కూడా ఉన్నారు. వాటర్‌ఫ్రంట్ పార్క్‌(Waterfront Park)కు దూరంగా ఉన్న భవనంలో జరిగిన కాల్పుల్లో.. తన సన్నిహిత స్నేహితుల్లో ఒకరిని కోల్పోయినట్లు కెంటుకీ గవర్నర్ ధృవీకరించారు. మృతుల‌ను జాషువా బారిక్ (40), టామీ ఇలియట్ (63), జూలియానా ఫార్మర్ (45), జేమ్స్ టట్ (64), డీనా ఎకెర్ట్ (57)గా గుర్తించారు. కాల్పులు జ‌రిపిన వ్య‌క్తిని 23 ఏళ్ల కానర్ స్టర్జన్‌గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దాడిని ప్రత్యక్ష ప్రసారం చేసిన కానర్ స్టర్జన్ త‌న‌ను తాను కాల్చుకుని అక్కడికక్కడే మరణించాడు. హంత‌కుడు కానర్ స్టర్జన్ షేర్ చేసిన‌ వీడియోను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తొలగించాయి.

Updated On 11 April 2023 12:32 AM GMT
Ehatv

Ehatv

Next Story