sex with her boyfriend: ప్రియుడితో రాసలీలల కోసం.. జైలులో ఉన్న భర్తకు బెయిలిప్పించి మరీ..! భార్య నీచాతి నీచం..!

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని, తమ రాసలీలల వ్యవహారం భర్తకు తెలియడంతో ఎక్కడ తనను భర్త తనను చంపేస్తాడన్న భయంతో కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి చంపించింది ఓ మహిళ. ట్విస్ట్ ఏంటంటే భర్త గంజాయి అమ్ముతూ పట్టుబడి జైలులో ఉన్నాడు, అతనికి బెయిల్‌ ఇప్పించి మరీ ఈ పనిచేసింది. ఇందుకు సొంత తమ్ముడితోపాటు ప్రియుడి సహకారం తీసుకుంది. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలకు చెందిన వ్యక్తి లాలూ శ్రీను హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు, వారి విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగలోకి వచ్చాయి. మొత్తం ఐదుగురు నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దదోర్నాలకు చెందిన అడపాల లాలూ శ్రీను లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో పేకాటకు అలవాటు పడి డబ్బు పోగొట్టుకున్నాడు. తాను పోగొట్టుకున్న సొమ్ము రాబట్టుకునేందుకు గంజాయి వ్యాపారం చేసేవాడు. ఇదిలా ఉండగా పెద్దదోర్నాలో మెకానిక్‌ షాపు నడుపుతున్న మృతుడి బావమరిది అశోక్‌కుమార్‌ వద్దకు సూర్యనారాయణ అనే వ్యక్తి తరచూ వచ్చేవాడు. పక్కనే కూల్‌డ్రింక్‌ పాపు నిర్వహిస్తున్న అశోక్‌ సోదరి ఝాన్సీతోనూ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ వ్యవహారం భర్త లాలూశ్రీనుకు తెలియడంతో భార్యతో తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో గంజాయితో పట్టుబడిన లాలూశ్రీను జైలుకు వెళ్లాడు. తనపై కోపంగా ఉన్న భర్త జైలు నుంచి బయటకు వస్తే చంపేస్తాడని ఆందోళన చెందిన ఝాన్సీ, సన్నిహితుడు సూర్యనారాయణ, సోదరుడు అశోక్‌కుమార్‌తో కలిసి హత్యకు పథకం రచించింది.

భర్తను అంతమొందించేందుకు గుంటూరుకు చెందిన కిరాయి హంతకులు పార్థు, శంకర్‌కు 2 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చింది. ఒంగోలు సబ్‌ జైల్లో రిమాండ్‌లో ఉన్న భర్త లాలూశ్రీనుకు బైయిల్‌ వచ్చేలా ఏర్పాట్లు చేసి, అతడిని కారులో దోర్నాలకు తీసుకొచ్చేందుకు కూడా ప్లాన్ వేశారు. తొలుత చీమకుర్తి వద్ద శ్రీనును హతమార్చాలని చూసినా అక్కడ పరిస్థితులు అనుకూలించలేదు. మార్గమధ్యంలో పెద్దారవీడు సమీపంలోని అంకాలమ్మ గుడి వద్దకు రాగానే మూత్ర విసర్జన వంకతో కారు ఆపారు. ఆ తర్వాత శ్రీను కళ్లల్లో కారం చల్లి, రాళ్లు, కత్తులతో దారుణంగా హతమార్చారు. నిందితులు ఝాన్సీ, అశోక్‌కుమార్‌ను అరెస్టు చేసి కోర్టుకు తరలించనున్నట్లు డీఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు.

Updated On 24 Jan 2026 5:10 AM GMT
ehatv

ehatv

Next Story