సంగారెడ్డి జిల్లా కొల్లూరులో దుర్ఘటన చోటుచేసుకుంది.

సంగారెడ్డి జిల్లా కొల్లూరులో దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రియుడితో గదిలో ఉన్న యువతి, తండ్రి రావడంతో భయపడి పారిపోవడానికి ప్రయత్నించగా, కాలు జారి కిందపడి మృతి చెందింది.

వివరాల ప్రకారం హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తికి ప్రభుత్వ డబుల్ బెడ్‌రూం ఇల్లు కొల్లూరులో కేటాయించబడింది. ఆ ఇల్లు ఖాళీగా ఉండగా, ఆయన కూతురు ఫాతిమా (20) తన ప్రియుడు హుస్సేన్ అలీతో శుక్రవారం ఆ ఇంటికి వెళ్లింది.ఇద్దరూ గదిలో ఉండగా ఫాతిమా తండ్రి అక్కడకు చేరుకుని తలుపు తట్టాడు. తండ్రి గొంతు విన్న ఫాతిమా భయంతో, ప్రియుడు సహాయంతో బాల్కనీ ద్వారా పక్క ఫ్లాట్‌కు వెళ్లేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో కాలు జారి ఎనిమిదవ అంతస్తు నుంచి కిందపడిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story