గోవాకు వెళ్లే ప్రేమ జంటలను పోలీసులు హెచ్చరిస్తున్నారు. గోవా వెళ్లి ప్రైవేట్‌గా హోటళ్లలో గడపాలనుకునేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.

గోవాకు వెళ్లే ప్రేమ జంటలను పోలీసులు హెచ్చరిస్తున్నారు. గోవా వెళ్లి ప్రైవేట్‌గా హోటళ్లలో గడపాలనుకునేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. తమ హోటళ్లలో దిగిన ప్రేమజంటలను ట్రాప్‌ చేసి వారు ప్రైవేట్‌గా గడిపిన సమయంలో సీక్రెట్ కెమెరాలు పెట్టి, ఆ తర్వాత ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో పెడతామని, డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు బాగా పెరిగిపోయాయి. గోవా(goa)కు వెళ్లిన ఓ జంట కలిసి ఉన్నప్పటి ఫోటోలు, వీడియోలను రహస్యంగా తీసి రూ.30 లక్షలు డిమాండ్‌ చేస్తున్న గోవాకు చెందిన ఓ వ్యక్తిపై సనత్‌నగర్‌ పోలీసులు (Sanathnagar police) కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఎర్రగడ్డ(Erragadda)కు చెందిన ఓ మహిళ (35) తన వివాహం కాకముందు 2023లో శ్రీనాథరావు(Srinadharao) అనే వ్యక్తితో కలిసి గోవాకు వెళ్లింది. వీరికి గోవాలోని యశ్వంత్‌(Yaswanth) (40) అనే వ్యక్తి వసతితో పాటు ఇతర ఏర్పాట్లను చేశాడు. అదే సమయంలో ఆ జంట కలిసి ఉన్నప్పటి వీడియోలను రహస్యంగా తీశాడు.

యశ్వంత్ వారు ఏకాంతంగా గడిపిన దృశ్యాలను సీక్రెట్ కెమెరా ద్వారా వీడియోలు తీశాడు. రెండేళ్లు తర్వాత.. అనుకోని కారణాల వల్ల మహిళకు మరో వ్యక్తితో పెళ్లయింది. మహిళ తన పెళ్లి ఫొటోలను వాట్సాప్‌ స్టేటస్‌లో ఉంచింది. మహిళ నెంబర్‌ యశ్వంత్‌ దగ్గర సేవ్‌ అయ్యి ఉండడంతో ఈ ఫోటోలు అతనికి కనిపించాయి. గతంలో తన హోటల్‌కు మరో వ్యక్తితో మహిళ వచ్చిందని, ఇప్పుడు మరొక వ్యక్తితో పెళ్లి జరిగిందని గ్రహించిన యశ్వంత్‌ ఆమెను బెదిరించసాగాడు. పాత వీడియోలు బయటపెడతానంటూ బెదిరింపులకు దిగాడు. 30 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేశాడు. తనకు వేరే వ్యక్తితో పెళ్లయిందని ఆమె చెప్పింది. తన వైవాహిక జీవితం చెడిపోతుందని, వదిలేయమని వేడుకుంది. యశ్వంత్ ఆమె మాటల్ని పట్టించుకోలేదు. వేధింపులు మరింత పెంచాడు. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది.

తాజాగా శ్రీనాథరావుకు ఫోన్‌ చేసి బెదిరించడం మొదలుపెట్టాడు. తనకు రూ.30 లక్షలు ఇవ్వాలని, లేనిపక్షంలో వీడియోలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో తనకు వచ్చిన బెదిరింపుల విషయాన్ని శ్రీనాథరావు ఆ మహిళ దృష్టికి తీసుకువచ్చాడు. భయాందోళనకు గురైన బాధితురాలు సనత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు యశ్వంత్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని గోవాకు పంపినట్లు పోలీసులు తెలిపారు. ప్రేమజంటలు లేదా ఇతర వ్యక్తులు ప్రైవేట్‌ హోటళ్లలో దిగినప్పుడు, తమ వాట్సాప్‌ నెంబర్లు పరిచయం లేని వ్యక్తులకు ఇవ్వడం, వారిది సేవ్‌ చేసుకోవడం వంటి చేయకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story