భర్త, అత్తమామల వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య చేసుకుంది.

భర్త, అత్తమామల వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాల సీఐ ప్రమోద్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ఎల్‌ఐసీ కాలనీకి చెందిన మిట్టపల్లి ప్రియాంకకు, మందమర్రి మండలం సారంగపూర్‌ గ్రామానికి చెందిన ప్రవీణ్‌తో 2014లో వివాహం జరిగింది. వీరికి కవల పిల్లలు రామ్, లక్ష్మణ్‌(9) ఉన్నారు. కొంతకాలం వరకు బాగానే ఉన్నా గత కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో ప్రియాంకను భర్త, అత్తమామలు రమాదేవి, సత్యనారాయణ వేధించేవారు. దీనికి తోడు మరిది కూడా వదిన పట్ల అమర్యాదగా ప్రవర్తించేవాడు. ఈ క్రమంలో ఈ నెల 9న ఆమెను కొట్టి ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. దీంతో ఎల్‌ఐసీ కాలనీలోని తల్లిగారింటి వద్దనే ఉంటోంది. అయినా వేధింపులు ఆగకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందింది. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతికి కారణమైన భర్త, మరిది, అత్తమామలపై చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లి అంకం ఓదమ్మ ఫిర్యాదు చేశారు. కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వివరించారు.

Updated On
ehatv

ehatv

Next Story