భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకొని తనకు, తన పిల్లలకు తనను దూరం చేశాడనే పగతో కత్తితో దాడి చేసి హతమార్చాడు ఓ వ్యక్తి

మురళీ అనే యువకుడికి గత పదిహేనేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహమైంది. అనంతరం వారికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తూ భార్యాపిల్లలతో హాయిగా జీవిస్తున్నాడు ప్రసాద్. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన తొత్తిడి ప్రసాద్ అనే చిరువ్యాపారి పచ్చగా ఉన్న మురళీ కుటుంబంలోకి ప్రవేశించాడు. ఒకే గ్రామం కావడంతో మురళీ భార్యతో ప్రసాద్ కు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. గత ఐదేళ్లుగా ప్రసాద్, మురళీ భార్యల మధ్య అక్రమసంబంధం కొనసాగుతూనే ఉంది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి చివరికి మురళీ దృష్టికి వచ్చింది. ప్రసాద్ తో ఉన్న వివాహేతర సంబంధం పై భార్యను నిలదీశాడు మురళీ. దీంతో మురళీ భార్య కూడా మురళీ పై వాగ్వాదానికి దిగింది. ఇరువురు ఘర్షణ పడ్డారు. అలా భార్యాభర్తలు ఇద్దరు తరచూ ప్రసాద్ విషయంలో గొడవ పడుతుండేవారు.
ఈ నేపథ్యంలోనే మురళీ భార్య మురళీని వదిలేసి తన ఇద్దరు పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది
కనీసం పిల్లలను కూడా మురళీ (Murali)వద్దకు పంపటానికి ఇష్టపడలేదు. అంతటితో ఆగకుండా తరచూ ప్రసాద్ తో కలిసి ఉండటం మురళీ కంటపడుతూనే ఉంది. ఇదంతా చూస్తున్న ప్రసాద్ తనకు జరుగుతున్న అన్యాయం పై రగిలిపోయాడు. ఎలాగైనా ప్రసాద్ ను అడ్డు తొలిగిస్తే తప్పా తన భార్య తన మాట వినదని నిర్ణయించుకున్నాడు. అలా ప్రసాద్ ను హతమార్చడానికి అనేక సార్లు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు
ఈ క్రమంలోనే రాత్రి ఏడు గంటల ప్రాంతంలో గ్రామంలో ఒక శుభకార్యం కోసం వ్యాపారంలో భాగంగా టెంట్లు వేస్తున్నాడు ప్రసాద్. ఇదే అదునుగా భావించిన ప్రసాద్ (Prasad)కత్తితో అకస్మాత్తుగా దాడి చేశాడు. తన పై దాడి జరుగుతుందని తేరుకునే లోపే ప్రసాద్ పై కత్తిపోట్ల వర్షం కురిపించాడు.. ఆ దాడిలో ప్రసాద్ అక్కడిక్కడే మృతి చెందాడు. వెంటనే మురళీ నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మురళీని అరెస్ట్ చేశారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది.
