డబ్బులు సంపాదించేందుకు అక్రమ మార్గాలు అనుసరిస్తున్నారు కొందరు. కొందరు తమ శరీరమే పెట్టుబడిగా పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు.

డబ్బులు సంపాదించేందుకు అక్రమ మార్గాలు అనుసరిస్తున్నారు కొందరు. కొందరు తమ శరీరమే పెట్టుబడిగా పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తరహా ఘటన అంబర్‌పేటలో జరిగింది. భార్యాభర్తలు తమ న్యూడ్ వీడియోలను యువతకు పంపించి డబ్బులు దండుకుంటున్న బాగోతం బయటపడింది. రూ.2000కు లైవ్ లింక్.. రూ.500కు రికార్డెడ్ వీడియోలు.. టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కిన దంపతులు. బాగ్ అంబర్‌పేట - మల్లికార్జుననగర్(Mallikarjuna Nagar)లో తన భార్యతో లైవ్ న్యూడ్ వీడియోల దందాను క్యాబ్ డ్రైవర్ నడిపిస్తున్నాడు. క్యాబ్ డ్రైవింగ్ కంటే ఈ దందాతోనే ఎక్కువ డబ్బులు రావడంతో ఇంటిపై హెచ్‌డీ కెమెరాలతో ఫుల్ సెటప్ చేసుకున్నాడు. రోజుకో కొత్త వీడియోలు అప్‌లోడ్ చేస్తూ.. ఆన్‌లైన్‌లో శృంగార చాటింగ్ చేస్తూ యువకులను దంపతులు ఆకట్టుకుంటున్నారు. రోజురోజుకు ప్రేక్షకులు పెరగడంతో పోలీసులకు లైవ్ న్యూడ్ వీడియోల దందా చేరింది. ఇంటిపై దాడి చేసి హెచ్‌డీ కెమెరాలను, పరికరాలను సీజ్ చేసి, దంపతులను అరెస్ట్ చేసిన ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు
